పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. యోహాను సువిశేషము 7–12

1.ఆయనవలె ఎవడును ఎన్నడును మాటాడలేదు అని క్రీస్తుని గూర్చి పల్కిన దెవరు?
2."నేనును నీకు శిక్ష విధింపను. వెళ్లము. ఇక పాపము చేయకుము" అని క్రీస్తు ఎవరితో పలికెను?
3.క్రీస్తు దినమునుచూచి సంతోషించిన పితరుడు ఎవరు?
4.యేసు పుట్టు గ్రుడ్డివానికి చూపు నిచ్చుటకు వాని కన్నులమీద ఏమి రాచెను?
5.తోడేలు వచ్చుట చూచి గొర్రెలమందను విడచి పారిపోవువా డెవడు?
6.మరియా మార్తల యూరు ఏది?
7. "నేను పునరుత్దానమును జీవమును" అని క్రీస్తు ఎవరితో నుడివెను?
8. యేసు ఎవరికొరకు కంట తడిపెట్టెను?
9.యెరూషలేము ప్రవేశించిన క్రీస్తును ప్రజలు ఏమి మట్టలతో ఆహ్వానించిరి?
10. క్రీస్తు భూమినుండి పైకి ఎత్తబడినపుడు యేమి చేయును?

42. యోహాను సువిశేషము 18–21

1.క్రీస్తు నడుమునకు తుందుగుడ్డ కట్టుకొని పళ్ళెములో నీళ్ళుపోసి ఏమి చేసెను?
2.కడపటి విందులో క్రీస్తునుండి రొట్టెముక్కను స్వీకరించినంతనే యూదా లోనికి ఎవరు ప్రవేశించిరి?
3.మాకు తండ్రిని చూపింపుము అని క్రీస్తుని అడిగిన దెవరు?
4. "నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపదును". ఎవరిని పంపును?
5.క్రీస్తుకు చెందిన ఏ వస్తువు కొరకు సైనికులు అదృష్టపు చీట్లు వేసికొనిరి?
6. సైనికుడు క్రీస్తు ప్రక్కను బల్లెముతో పొడువగా ఏమి స్రవించెను?
7. క్రీస్తు ఉత్దానాంతరము మొదట ఖాళీ సమాధిలోనికి ప్రవేశించిన దెవరు?
8.ఉత్థాన క్రీస్తునిచూచి తోటమాలియని భ్రమపడిన దెవరు?
9. చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని క్రీస్తు ఎవరితో చెప్పెను?
10. ఉత్థానానంతరము క్రీస్తు పేత్రుని మూడుసార్లు అడిగిన ప్రశ్నయేది?

43. అపోస్తలుల చర్యలు 1–4

1.ఉత్థాన కీస్తు ఎన్నాళ్ళపాటు శిష్యులకు కనిపించుచు వచ్చెను?
2.శిష్యులు ఎవరినుండి జ్ఞానస్నానము పొందుదురు?