పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37. లూకా సువిశేషము 7-11

1.రానున్నవాడవు నీవేనా అని అడుగుటకు క్రీస్తు నొద్దకు మనుష్యులను పంపిన దెవరు?
2.గెరాసీను మండలములోని నరుని ఆవేశించిన భూతము పేరేమి?
3. చనిపోయినపుడు యాయిూరు కొమార్తె వయసెంత?
4.ఆకాశమునుండి అగ్నిని రప్పించి సమరయుల గ్రామమును నాశము చేయగోరిన శిష్యులెవరు?
5. నాగటిమీద చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేనికి అయోగ్యుడు?
6.నీ పేరిట పిశాచములు కూడ మాకు లోపబడుచున్నవి అని క్రీస్తుతో చెప్పిన దెవరు?
7.క్రీస్తు ఎవరిని ఆకాశమునుండి మెరుపవలె పడుచుండగా చూచెను?
8.క్రీస్తు పాదములవద్ద కూర్చుండి అతని బోధలు విన్న భక్తురాలు ఎవరు?
9.శిష్యులు ప్రార్థన నేర్పమని అడుగగా క్రీస్తు వారికి ఏ జపము నేర్పించెను?
10.అర్ధరాత్రిలో వచ్చినవాడు తన మిత్రుని ఎన్నిరొట్టెలు బదులీయమని కోరెను?

38. లూకా సువిశేషము 11-15

1.మంచి సమరయుని కథలో దొంగలకు చిక్కినవాడు ఏ నగరమునుండి ఏ నగరమునకు ప్రయాణము చేయుచుండెను?
2.గాయపడి త్రోవ ప్రక్కన పడియున్న వానిని పట్టించుకొనకుండ వెళ్ళిపోయిన
యిద్దరు ఎవరు?
3.క్రీస్తు బోధల ప్రకారము, నరులు ఏ పక్షులకంటె శ్రేషులు?
4. "అవి విత్తనములు నాటవు. నూర్పిళ్ళ చేయవు. ధాన్యము నిలువజేయవు" - అవి ఏవి?
5. క్రీస్తు ఈమెను తాకగా ఈమె తిన్నగా నిలబడి దేవుని స్తుతించెను. ఈమె ఎవరు?
6. క్రీస్తు పరలోక రాజ్యమును ఏ చెట్టుతో పోల్చెను?
7. కోడి తన పిల్లలను వలె నేను నీ బిడ్డలను కాపాడగోరితిని అని క్రీస్తు ఏ పట్టణముతో చెప్పెను?
8.ప్రభువు నూరుగొర్రెల సామెత చెప్పెను. వానిలో తప్పిపోయినవి ఎన్ని?
9.అతడు చెప్పిన ఇంకొక సామెతలో, ఒక స్త్రీ ఒక వస్తువును పోగొట్టుకొని దానికై యింటిలో వెదకెను. ఆ వస్తువు ఏమిటి?
10. "మరణించిన ఈ నా కుమారుడు మరల బ్రతికెను" — ఆ కుమారుడు ఎవరు?