పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7.దావీదు ఒక సైనికుని మోసముతో చంపించి ఆతని భార్యను తన భార్యను చేసికొనెను. ఆమె పేరేమి?
8.ఈ పాపమునకుగాను దావీదుని చీవాట్ల పెట్టిన ప్రవక్త ఎవరు?
9.తండ్రియైన దావీదుపై తిరగబడిన కుమారుడెవరు?
10.దావీదు తర్వాత అతని కుమారులలో ఎవరు రాజయ్యెను?

6. ప్రవక్తలు

1.రెండవ దేవాలయ నిర్మాణమును ప్రోత్సహించిన ప్రవక్త ఎవరు?
2.సింహముల గుంటలోనికి తోయబడిన దీర్ఘదర్శి ఎవరు?
3.ఎండిన యెముకలు జీవముతో లేచునట్లుగా ప్రవచనము చెప్పిన ప్రవక్త యెవరు?
4.నాల్గువందలమంది ప్రవక్తలు అసత్యము చెప్పచుండగా తానుమాత్రము సత్యమునే చెప్పిన ప్రవక్త యెవరు
5.తెకోవ నగరపు గొర్రెల కాపరి ప్రవక్త అయ్యాడు. అతని పేరేమి?
6.ప్రభువు ఇతనితో స్నేహితుడు స్నేహితునితోవలె మాట్లాడాడు. ఇతడు ఎవరు?
7.ప్రభువు పిలువగా నేనున్నానుకదా నన్ను పంపుడు అని పల్కిన దీర్ఘదర్శి ఎవరు?
8.ఈ ప్రవక్త భార్య పేరు గోమెరు. ఇతని పేరేమి?
9.పూడిక బావిలోనికి త్రోయబడిన దీర్ఘదర్శి ఎవరు?
10.పౌలు నడికట్టుతో తన కాలు సేతులను బంధించుకొనిన ప్రవక్త ఎవరు?

7. పూర్వవేద రాజులు

1.అబ్రాహాముని కలసికొని అతనిని దీవించిన షాలేము రాజు ఎవరు?
2.యిస్రాయేలీయులకు మొదటి రాజెవరు?
3.యువకుడుగా నున్నపడే దేవునినుండి జ్ఞానమును వరముగా కోరుకొనిన రాజెవరు?
4.సొలోమోను దేవాలయమును కట్టుటకు కలపను సరఫరా చేసిన తూరుదేశపు రాజెవరు?
5.సొలోమోనును సందర్శించుటకు వచ్చినరాణి ఎవరు?
6.ఈరాజు దేవుని ప్రార్ధింపగా అతడు ఇతని ఆయుస్సు 15 సంవత్సరాలు
పొడిగించెను. ఈ రాజు ఎవరు?
7.దైవశిక్ష వలన కుష్టరోగియైన రాజెవరు?
8.యిస్రాయేలు చివరి రాజెవరు?