పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.సూర్యచంద్రులు పదునొకండు నక్షత్రాలు తనకు దండము పెట్టినట్లుగా యోసేపునకు కల వచ్చినది. ఈ వస్తువులు ఎవరిని సూచించును? 4. సోదరులు యోసేపని యిష్మాయేలీయులకు ఎంతవెల కమ్మిరి? 5. యోసేపుతోపాటు చెరలోవున్న రాజసేవకులు ఇద్దరు ఎవరు? 6. తన కలలకు అర్ధము చెప్పినందుకు ఫరో యోసేపుకి ఏమి పదవి నిచ్చెను? 7. యోసేపు భార్య పేరేమి? 8.అతని యిద్దరు కుమారుల పేరులేమి? 9. గృహనిర్వాహకుడు యోసేపు గిన్నెను ఎవరి గోతములో దాచెను? 10. యాకోబు ఆతని కుమారులు ఈజిప్టులోని ఏ మండలమున వసించిరి?

}{{center|

4. మోషే కథ

}

1.నైలు నదిలో మోషే శిశువును చూచిన దెవరు? 2.మోషే ఈజిప్టునుండి ఎందుకు పారిపోయెను? 3.మోషే భార్య పేరేమి? 4.అతని మామ పేరేమి? 5. దేవుడు మోషేను చెప్పలు విడువమనినపుడు అతడు దేనివైపు చూచుచుండెను? 6. దేవుడు ఈజిప్టమీదికి ఎన్నియరిష్టములు పంపెను? 7. దేవుడు యిస్రాయేలీయులను ఏయే స్తంభముల రూపమున నడిపించుకొని పోయను? 8.సీనాయి కొండమీద మోషే దేవునినుండి ఏమి స్వీకరించెను? 9.ఈజిప్టునుండి వెడలి వచ్చినందుకు జ్ఞాపకార్ధముగా మోషే నెలకొల్పిన పండుగ ఏది? 10.అతడు ఏ కొండపై చనిపోయెను?

5. దావీదు

1.దావీదు తండ్రి పేరేమి? 2.అతడు జన్మించిన నగరమేది? 3. బేత్ల్లెహేము నగరమున అతనిని రాజుగా అభిషేకించి ప్రవక్త ఎవరు? 4.అతడు ఫిలిస్ట్రీయ వీరుని దేనితో కొట్టి చంపెను? 5. అతనికి ప్రాణస్నేహితుడు ఎవరు? 6. దావీదు దాగుకొనిన గుహ పేరేమి? 210