పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.హీబ్రూ బాలురను అగ్నిగుండములో త్రోయించిన రాజెవరు?
10.యూదులను బాబిలోనియా ప్రవాసమునుండి తిరిగి రానిచ్చిన పర్షియా రాజెవరు?

8. పూర్వవేద స్త్రీలు

1.చిన్న కుమారునకు మేలు చేయుటకు భర్తను మోసగించిన స్త్రీ ఎవరు?
2.తన దేశమును విడచిపెట్టి అత్తతోపాటు బేత్లెహేమునకు తిరిగివచ్చిన మోవాబు స్త్రీ ఎవరు?
3.పర్ష్యాదేశమున వష్టికి బదులుగా రాణియైన యిస్రాయేలు మహిళ ఎవరు?
4.మోషే అక్క పేరేమి?
5.కుమారుని షిలో దేవాలయమున కానుకగా సమర్పించిన తల్లి ఎవరు?
6.ఉప్పుస్తంభముగా మారిన స్త్రీ ఎవరు?
7.శత్రుసైన్యాధిపతియైన హోలోఫెర్నెసును చంపిన స్త్రీ ఎవరు?
8.బైబులులో కన్పించు ఏకైక మంత్రగత్తె ఎవరు?
9.కణతలలో మేకును దిగగొట్టి శత్రువును చంపిన వీర వనిత ఎవరు?
10.దేవుని దూషీంపుమని భర్తకు సలహా యిచ్చిన స్త్రీ ఎవరు?

9. నూత్నవేద స్త్రీలు

1.దేవాలయమున బాలయేసును తోడివారికి ఎరుకపరచిన వితంతువు ఎవరు?
2.క్రీస్తు ప్రేమించిన సోదరీమణులు ఎవరు?
3.క్రీస్తు ఎవరివద్దనుండి ఏడు దయ్యములను పారదోలెను?
4.క్రీస్తు జీవముతో లేపిన బాలిక ఎవరు?
5.ఒక మోసగాని భార్యయు స్వయముగా మోసగత్తెయునై పేత్రు శాపము వలన ప్రాణములు కోల్పోయిన స్త్రీ ఎవరు?
6.సుఖారు బావివద్ద క్రీస్తుతో మాట్లాడిన స్త్రీ ఎవరు?
7.చెరనుండి మార్కు ఇంటికివచ్చి తలుపుతట్టిన పేత్రుకి ద్వారము తీసిన సేవకురాలు ఎవరు?
8.ఆ నీతిమంతునిగూర్చి నీవు ఏమియు జోక్యము కలిగించుకోవలదు అని భర్తకు కబురు పంపిన స్త్రీ ఎవరు?
9.స్నాపక యోహాను శిరస్సును పళ్ళెములో పెట్టి ఇప్పింపుడు అని హేరోదు రాజును అడిగిన దెవరు? 10.క్రీస్తు ఈమె చేతిని తాకగానె ఈమె జ్వరముపోయినది. ఈమె ఎవరు?