పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌలు ప్రభువుని నిర్లక్ష్యంచేసి అతని ఆజ్ఞను త్రోసి వేసాడు. యావేకూడ సౌలుని రాజపదవినుండి త్రోసి వేసాడు. ఇక అతనికి బదులుగా దావీదు రాజవుతాడు.

ఈ 15వ అధ్యాయాన్ని కూర్చిన రచయిత రెండు సంప్రదాయాలను ఒకదాని ప్రక్కన ఒకటి చేర్చాడు. 24-29 వచనాల ప్రకారం సమూవేలు సౌలుతో బలికి వెళ్ళలేదు. 30-31 వచనాల ప్రకారం వెళ్లాడు.

మొదట తొలి సంప్రదాయాన్ని చూద్దాం, ప్రవక్త చీవాట్లు పెట్టగా కట్టకడన సౌలు తన తప్పని ఒప్పకొన్నాడు. సైనికులకు మోమోటపడి వారు పశువులను దక్కించుకోడానికి అనుమతినిచ్చానని అంగీకరించాడు. తనతోపాటు బలినర్పించడానికి ప్రవక్తను గిల్లాలునకు రమ్మని వేడుకొన్నాడు. ప్రవక్త అతని వేడుకోలును తిరస్కరించి ప్రక్కకు తొలగిపోతూండగా సౌలు అతని అంగీ చెంగును పట్టుకొన్నాడు. ఈలా చేయడం సౌలు అణకువకు చిహ్నం. ప్రవక్తను బతిమాలడానికి గురుతు. కాని ప్రవక్త గబాలున వెళ్ళిపోబోగా అతని అంగీ చెంగు చినిగింది. ఈలా చినగడం సౌలు రాజ్యం చినిగిపోయిందనడానికి గుర్తు.  కనుకనే ప్రవక్త యిక్కడ "ప్రభువు యిస్రాయేలు రాజ్యాన్ని నీ చేతినుండి లాగివేసి నీకంటె యోగ్యుడైన వాడికి ఇచ్చివేసాడు" అని చెప్పాడు. ఈ యోగ్యుడైనవాడు దావీదే. 

ఇస్రాయేలీయులకు దీపమైన ప్రభువు రాజ్యపదవిని నెలకొల్పినందులకు విచారించలేదు. అది యికమీదట దావీదుద్వారా కొనసాగుతుంది.

ఇక రెండవ సంప్రదాయం ప్రకారం (30-31) తన వెంట గిల్లాలు బలికిరమ్మని రాజు సమూవేలుని బతిమాలాడు. యిప్రాయేలు పెద్దలమందు తన పరువు నిలబెట్టమని వేడుకొన్నాడు. సమూవేలు అలాగే గిల్లాలుబలిలో పాల్గొన్నాడు. 

ఈ యధ్యాయం చివరలో అమాలెకీయుల రాజయిన అగాగు మరణవృత్తాంతం వస్తుంది. అతడు సౌలు తన్ను చంపలేదు కనుక మరణాన్ని తప్పించుకోవచ్చుననుకొన్నాడు. మరణభయం తీవ్రత తగ్గిందనుకొన్నాడు. కాని సమూవేలు అతన్ని గిల్లాలు బలిపీఠం దగ్గరికి రప్పించాడు.

అతనితో ఓరి! పూర్వం నీ కత్తివలన చాలమంది తల్లలు తమ బిడ్డలను కోల్పోయారు. ఇప్పడు నా కత్తివలన నీతల్లికూడ తన బిడ్డణ్ణి కోల్పోతుంది" అన్నాడు. బలిపీఠం ముందట, యావే యెదుట, అతన్ని బలిపశువును లాగ ముక్కలు ముక్కలుగా నరికివేసాడు. ఈలా సౌలు చేయవలసిన పనిని ప్రవక్షే చేసి ముగించాడు. 

తర్వాత సౌలు గిల్బోవా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిమ్మట దావీదు రాజయ్యాడు. ఈ రీతిగా సమూవేలు ప్రవచనం నెరవేరింది.