పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పనికిమాలిన ముక్క వొకటి అతని కంటబడుతుంది
అది వంకరపోయి మళ్ళతో నిండివుంటుంది
అతడు దాన్ని తీరికవేళల్లో నేర్చుతో చెక్కి
మనుష్యాకృతిగల బొమ్మనుగా మలుస్తాడు
లేదా నీచమైన మృగంగా తయారుచేస్తాడు
ఆ బొమ్మకు ఎర్రరంగుపూసి దాని నెర్రెలు
కప్పివేస్తాడు
తరువాత గోడలో ఒక గూడు తయారుచేసి
ఆ గూటిలో ఇనుప చీలల్తో దాన్ని బిగగొడతాడు
అది జారిపడకుండేలా జాగ్రత్తపడతాడు
అది వట్టి బొమ్మ కనుక తనంతట తాను నిలువలేదనీ
ఇతరులు దాన్ని ఆదుకోవాలనీ అతనికి తెలుసు
ఐనా ఆ నిర్జీవ ప్రతిమకు ప్రార్ధన చేయడానికి
అతనికి సిగ్గులేదు
తన పెండ్లి, పిల్లలు, సంపదలనుగూర్చి
అతడు దానికి మనవి చేస్తాడు
ఆ బొమ్మ సామర్థ్యం లేనిది
ఐనా ఆరోగ్యం కొరకు అతడు దానికి ప్రార్ధనచేస్తాడు,
అది నిర్జీవమైంది
ఐనా జీవం కొరకు దానికి మనవి చేస్తాడు,
అది శక్తిలేనిది
ఐనా సహాయం కొరకు దానికి విన్నపాలు చేస్తాడు,
అది అడుగైన కదపలేనిది
ఐనా ప్రయాణసాఫల్యం కొరకు దానికి మనవిచేస్తాడు,
ఆ బొమ్మ చేతులకు శక్తిలేదు
ఐనా తనకు లాభం కలగాలనీ
తాను డబ్బు చేసికోవాలనీ
దానికి విజ్ఞాపనం చేస్తాడు - 13, 10-19.

ఈ గ్రంథకర్త మరొక తావులో విగ్రహాల పుట్టుకను గూర్చి యిలా చెప్పాడు. ఓ తండ్రి తన కొడుకు చనిపోతే దిగులుతో వాడి బొమ్మనుచేసి వాడ్డి పూజించాడు. ఆ తండ్రి తర్వాత వచ్చిన నరులూ ఆలాగే ఆ కొడుకుని పూజించారు. ఈలా విగ్రహారాధనం