పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారినంతగా నిందింపనక్కరలేదేమో!
వాళ్లు తను చుట్టూవున్న సృష్టివస్తువులమధ్య జీవిస్తూ
వాటిని మాటిమాటికి పరిశీలించి చూస్తూ
వాటి అందానికి బ్రమసి
వెలుపలి ఆకారం వలన మోసపోయారు
ఐనా ఆ ప్రజల అవివేకాన్ని మన్నించరాదు
వాళ్ళు లోకస్వభావాన్ని గూర్చి
సిద్దాంతాలు చేయగల్లిగూడ
లోకనాథుని తెలిసికోకపోవడానికి కారణమేమిటి? - సాలో జ్ఞాన 13,1-9.

ఈ పుస్తకం విగ్రహారాధనాన్ని గూడ నిశితంగా ఖండిస్తుంది. వడ్రంగి చెట్టును నరికి దాన్ని చెక్కిరోజువారి పనికి ఉపయోగపడే పనిముట్టును తయారుచేస్తాడు. మిగిలిన ముక్కలతో అన్నం వండుకొంటాడు. కాని ఆ ముక్కల్లోనే ఓ పనికిమాలిన ముక్కను తీసికొని దాన్ని మనుష్యాకృతిగల బొమ్మగానో, మృగరూపంలో వున్న బొమ్మనుగానో మలుస్తాడు. ఆ బొమ్మకు మెరుగులు దిద్ది, రంగులుపూసి దాన్ని గోడలోని గూటిలో పెడతాడు. అటుతర్వాత అతడు సిగ్గూసెరమూ లేకుండా ఆ నిర్జీవ ప్రతిమకు ప్రార్థన చేస్తాడు. జీవమేలేని ఆ బొమ్మ,శక్తిలేని ఆ బొమ్మ ,అతనికేలా సహాయం చేస్తుంది? కనుక విగ్రహాల కొలువు వెర్రితనం.

నిర్జీవాలైన ప్రతిమలను నమ్మేవాళ్ళు
నిక్కంగా దౌర్భాగ్యులు.
వాళ్ళు నరమాత్రులు చేసిన వస్తువులను దైవాలని పిలుస్తారు
అవి వెండిబంగారాలతో
అందంగా మలచిన మృగరూపాలు
లేదా పూర్వమెవడో చెక్కిన నికృష్ణశిలలు
నిపుణుడైన వడ్రంగి అనువైన చెట్టును నరికి
దాని బెరడునంతటిని ఒలిచివేసి
దాని మొండెంనుండి
రోజువారి పనులకు ఉపయోగపడే
పనిముట్టు నొకదాన్ని తయారుచేస్తాడు
మిగిలిన ముక్కలను వంటచెరకుగా వాడుకొని
అన్నం వండుకొని ఆరగిస్తాడు
కాని మిగిలిన వాటిల్లోనే