పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుకలోకి వచ్చింది. ఇంకా, కళాకారులు రాజు బొమ్మను చేస్తారు. సామాన్య జనులు రాజమీదగల గౌరవంచే దాన్ని ఆరాధిస్తారు. ఈలాకూడ విగ్రహాల కొలువు వ్యాప్తిలోకి వచ్చింది. నరమాత్రులు క్రమేణ దేవుళ్ళయ్యారు.

పూర్వం ఒక తండ్రి
 తన పత్రుడు తలవని తలంపుగా చనిపోగా
 ఘోరవ్యాకులత నొంది వాని బొమ్మను చేసాడు
 నిన్న చచ్చిన నరుడ్డి నేడు దేవుణ్ణి చేసి పూజించాడు
 అతడు తనక్రిందివారికీ ఆ దేవుణ్ణి పూజించే విధానమూ
 రహస్యారాధన పద్ధతులూ నేర్పిపోయాడు
 కాలక్రమేణ ఆ దుష్టకార్యం బలపడి
 నియమంగా మారిపోయింది.
 రాజుల శాసనంపై బొమ్మలు ఆరాధ్యదైవాలయ్యాయి
 దూరంగా వున్న రాజును
 తమ యెదుట గౌరవింపగోరిన ప్రజలు
 అతని ఆకారాన్ని వూహించుకొని
 ప్రతిమను తయారుచేస్తారు
 దూరాన వున్నవాణ్ణి దగ్గరలో వున్నవాడ్డిలాగ
 ముఖస్తుతి చేయాలని వారి ఆశయం
 ఈ బొమ్మలను చేసిన దురాశాపరుడైన కళాకారుడు
 ఆ రాజునిగూర్చి యేమాత్రం తెలియనివాళ్ళనుగూడ
 అతని ఆరాధనకు పురికొల్పుతాడు
 అతడు రాజు మెప్పు పొందగోరి నేర్పుతో
 రాజుకంటె అతని ప్రతిమను సుందరంగా మలుస్తాడు
 సామాన్యులు ఆ ప్రతిమ. పౌందర్యానికి మురిసిపోయి
 పూర్వం తాము నరునిగా ఎంచి గౌరవించినవానినే
 ఇపుడు ఆరాధించడానికి పూనుకొంటారు
 ఈ రీతిగా ప్రజలు గోతిలో పడసాగారు
 వాళ్లు యాతనలు అనుభవించడం వల్లనో
 లేక రాజాజ్ఞకు బదులు కావడం వల్లనో
 ఏ వస్తువుకీ చెల్లని దివ్యత్వాన్ని
 ఓ కొయ్యకో ఐండకో అంటగట్టి
 వాటిని పూజించడం మొదలెట్టారు - 14, 15-21.