పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గృహిణీ విద్యకూడ అలవరచుకొనివుంటే చాల ఉపయోగకరంగా వుంటుంది. ఈ విషయాలన్నీ విచారించి చూచేందుకు మన పెద్దలు ప్రతి మేత్రాసనంలోను కుటుంబ సలహా కేంద్రాలను అవశ్యంగా ఏర్పాటు చేయాలి.

ప్రార్ధనా భామాలు

1. వివాహం తాత్కాలికమైంది

వివాహం ఈ జీవితానికే పరిమితం. మోక్షంలో వివాహం వుండదు. ఈ లోకంలో నరులు చనిపోతూంటారు. కనుక వివాహం ద్వారా నూత్న మానవులను పుట్టించవలసి వచ్చింది. పరలోకంలో చావలేదు కనుక అక్కడ నూత్ననరులను పుట్టించవలసిన అవసరంలేదు. అక్కడివాళ్ళ దేవదూతలతో సమానంగా వుండిపోతారు. కనుక వివాహానికి తాత్కాలిక స్థితేగాని శాశ్వతస్థితి లేదు - లూకా 20,34-36.

2. వివాహం చెడ్డదికాదు

ప్రాచీనకాలంలో పతితులు కొందరు వివాహం చెడ్డదని బోధించారు. ఇరెనేయస్ అనే వేదశాస్త్రి వారి వాదాన్ని ఖండించి ఈలా బోధించాడు. "దేవుడు నరదేహాలను సృజించినపడే లింగ వ్యత్యాసాన్ని ప్రవేశపెట్టాడు. నరులను స్త్రీపురుషులనుగా సృజించాడు. కనుక ఆదిమకాలంలోనే భగవంతుడు వివాహాన్ని ఉద్దేశించాడు. దేవుడే నిర్ణయించిన పెండ్లి పవిత్రమైనదై యుండాలి.

2. సొంతభార్య సొంతభర్త

పౌలు బోధల ప్రకారం బ్రహ్మచర్యం మెరుగైంది. కాని వివాహం చెడ్డదికాదు. ఆనాడు కొరింతులో వ్యభిచారం బహుళ ప్రచారంలో వుండేది. కనుక పౌలు ఈ దోషానికి దూరంగ వుండమని తన క్రైస్తవులను హెచ్చరించాడు. వ్యభిచారానికి లొంగకుండా వుండడానికై ప్రతి పురుషునికి సొంత భార్య ప్రతి స్త్రీకి సొంత భర్త వండాలని ఆదేశించాడు - 1కొ 7,2. నిగ్రహశక్తిలేని అవివాహితులు విధవలు మొదలైనవాళ్లు పెండ్లి చేసికోవడం మంచిదని చెప్పాడు. కామం వలన కాలిపోవడం కంటె పెండ్లియాడ్డం ఉత్తమమని వాకొన్నాడు - 7,9. కనుక వివాహం దానంతట అది మేలైందే.

4. దైవాశీస్సులు

వివాహపూజలో వచ్చే ఓ ప్రార్ధనం ఇది. "పావన పితా! నీ ప్రణాళికద్వారా స్త్రీ పురుషుల ఐక్యతతో గూడిన వివాహ వ్యవస్థ ఏర్పడింది. నేడు వివాహం ద్వారా తన