పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రచురంగా కన్పిస్తాయి. వివాహమయ్యాక ఆ వ్యక్తిలోని దురుణాలు, అల్పగుణాలుకూడ గోచరిస్తాయి. 2. వివాహమయ్యాక ఎదుటివ్యక్తి వ్యక్తిత్వం ఉన్నది ఉన్నట్లుగా బయటపడుతుంది. ఒకోమారు, ఈ వ్యక్తి నన్ను వంచించి వివాహం చేసికోవడం జరిగింది గదా- అనే భావంకూడ కలుగుతుంది. విశేషంగా యువతికి ఈ యన్యాయం ఎక్కువగా జరుగుతుంది. పెండ్లయ్యాక మగవాళ్ళు తమ దురుణాలను సవరించుకోరు, కప్పిపుచ్చుకోరుగూడ. అసలు ఇక వాళ్ళకా యవసరమే కనిపించదు. 3. కడన ప్రేమ సంగతికూడ చెప్పాలి. లోకంలో ఉత్తమప్రేమ లేకపోలేదు. ప్రేమించి పెండ్లి చేసికొని సంతృప్తికరంగా జీవించినవాళ్ళూ లేకపోలేదు. కాని తరచుగా మన యువతీయువకులు ఎదుటివ్యక్తి శారీరక సౌందర్యానికీ, దైహికాకర్షణకూ బ్రమసిపోయి అదే ప్రేమ కాబోలు అని బ్రాంతి పడుతుంటారు. కేవలం శారీరక సౌందర్యానికి లొంగి ఓ వ్యక్తిని పెండ్లాడితే కొద్దిరోజుల్లోనే అసంతృప్తి కలిగి తీరుతుంది. పైయంశాల ఫలితార్థమేమిటంటే, ఎదుటివ్యక్తి గుణగణాలను చక్కగా విచారించి తెలిసికోందే ఆ వ్యక్తితో వివాహం తలపెట్టకూడదు.

8. వివాహోపదేశం

వివాహానికి ముందు వధూవరులు తప్పకుండా కొంత ఉపదేశాన్ని కూడ పొందాలి. ఈ వుపదేశంద్వారా తెలిసికోవలసిన ముఖ్యాంశాలు ఇవి : 1. వివాహమూ ప్రేమ జీవితమూ, క్రైస్తవ ప్రేమకుండవలసిన లక్షణాలు. 2. భార్యా భర్తలు ఒద్దికగా జీవించడమూ, లైంగిక జీవితం 3. వివాహం ఓ క్రైస్తవ సంస్కారం. 4. వివాహాన్ని రద్దుచేయగలిగే బాధకాలు. 5. పరిమిత కుటంబం. 6. బిడ్డల పెంపకం. 7. ప్రార్థన, క్రైస్తవ సంస్కారాలు - మొదలైనవి.

వధూవరులకు వివాహ పూజలోని భావాలను వివరించి చెప్పాలి. పెండ్లి తంతును విశదం చేయాలి. ఈ పూజలోను ఈ తంతులోను వివాహానికి సంబంధించిన ఆదర్శాలు చాల వర్ణింపబడ్డాయి.

పెండ్లి చేసికోబోయే యువతీయువకులు వివాహపు ధ్యానం చేయడం మంచిది. ఈ ధ్యానంలో పై యంశాలన్నీ విపులంగా బోధించవచ్చు. వాటినిగూర్చి నిదానంగా అవధానంగా ప్రార్ధనం చేసికోవచ్చు. ప్రార్ధనద్వారాగాని వేదసత్యాలు జీర్ణానికి రావు.

వివాహానికి ముందే లైంగిక జీవితానికి సంబంధించినంత మటుకు వైద్యజ్ఞానంకూడ సంపాదించి వుండడం మంచిది. నాలుగైదు వివాహాలు జరిగేప్పుడు సులభంగా ఓ డాక్టరునిగాని, ఓ నర్సునిగాని పిలిపించి ఈ వైద్య విషయాలను చెప్పించుకోవచ్చు. పైగా మన యువతులు వంట మొదలైన నిత్యకృత్యాలనుగూర్చి కొంత