పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్ణయించుకోవడం. వీనిలో 14 పద్ధతులు ఉత్తమమైనవి కావు. 2,3 యోగ్యమైన నిర్ణయాలు. 3వది అన్నిటికంటె శ్రేష్టమైన పద్ధతి. ఏదిఏమైనా వివాహబంధంలో ప్రవేశించకముందు బిడ్డలు తల్లిదండ్రులను సంప్రతించడమంటూ వుండాలి.

ఇక వివాహాలు పొందికగా వుండాలంటే మున్ముందు గానే ಇರುವಐಲವ್ಳಿಬ್ಬ వధూవరుల గుణగణాలను, వివరాలను తెలిసికొని వండాలి. ఈ వివరాలుగూడ చాల రంగాలకు వర్తిస్తాయి. 1. మొదట వధువు లేక వరుని కుటుంబ వాతావరణం తెలిసి వుండాలి. పెద్దల అలవాట్ల పిల్లలకు వస్తాయి. అంచేత యెదుటివ్యక్తి కుటుంబంలో ఏవైనా దురభ్యాసాలు ఉన్నాయేమో విచారించి చూడాలి. 2. ఎదుటి వ్యక్తి ఆదర్భాలూ, నైతికజీవితం - అనగా నిజాయితీ, ఋజువర్తనం, శీలసంపత్తి మొదలైన అంశాలను తెలిసికొని వుండాలి. విశేషంగా వరుని విషయంలో ఈ విషయాలను క్షుణ్ణంగా తెలిసికొని ఉండాలి. ఒకమారు పెండ్లయ్యాక, మగవాళ్ళు తమ గుణాలను ఇక మార్చుకోరు. 3.ఎదుటి వ్యక్తిస్థాయి అభిరుచులుగూడ గమనించి వుండాలి. విద్య, ఆర్థికస్తోమత నాగరికత మొదలైన බංඟීද් వధూవరులకు కొంత సామ్యం వండాలి. లేకుంటే కాకి ముక్కుకు దొండవండులా వుంటుందేగాని, పొందికంటూ కుదరదు. 4. మనం మత విషయాలనుగూడ గుర్తించాలి. ఎదుటి వ్యక్తికి మతాచరణంపట్ల పట్టుదల వుందా లేదా అని విచారించాలి. చాల జాగ్రత్తగా ముందు వెనుకలు ఆలోచించిగాని క్రైస్తవేతరులతో వివాహం తలపెట్టరాదు. 5. ఎదుటి వ్యక్తి ఆరోగ్య విషయాలనూ గుర్తించాలి. విశేషంగా వంశపారంపర్యంగా సంక్రమించే దీర్ఘవ్యాధులను గూర్చి జాగ్రత్తగా తెలిసికొని వండాలి. 6. కడన వధువు అందచందాలూ విచారించాలి. అందచందాలు అంత ముఖ్యంకాదు. వాటికంటే శీలసంపత్తి ప్రధానం, రూపానికీ, శీలానికి తరచుగా పొత్తు కుదరదుకూడ. ఐనా సౌందర్యవతియైన యువతి లభించినపుడు యువకుడు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించాలి.

ఇక, పై వివరాలను విచారించి తెలుసుకున్నాక, కొన్ని లోపాలువున్నా ఎదుటి వ్యక్తిని అంగీకరించవచ్చు. వివాహం చేసికోవచ్చు కాని అలాంటప్పుడు వివాహం చేసికునే వ్యక్తి ఈ లోపాలను బుద్ధిపూర్వకంగా అంగీకరించి స్వయంగా ఇష్టపడిపెండ్లిజేసికోవాలి. లేకుంటే తర్వాత మళ్ళా చిక్కులు వస్తాయి. ఇంకో విషయంగూడ, లోకంలో సర్వగుణ సంపూర్ణులైన మానవులెవ్వరూ లేరు. కనుక సంపూర్ణ వ్యక్తికోసం ఎదురుచూస్తూ కూర్చుంటే అసలు పెండ్లి కానేకాదు!

కడన యువతీయువకులు ఈ క్రింది అంశాలను గూడ తెలిసికొని వుండడం మంచిది. వివాహానికిముందు ఎదుటి వ్యక్తిలోని మంచిగుణాలూ గొప్పగుణాలూ మాత్రమే