పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. భక్తి మార్గం

వివాహ జీవితం జీవించేవాళ్లు ప్రేమ, సిలువ మార్గాలనే కాక భక్తిమార్గాన్ని గూడ అనుసరిస్తూ వుండాలి. దంపతులు తమ వివాహ జీవితంతో మూడు విధాలుగా భక్తిని పెంపొదించుకోవచ్చు. మొదటిది, ఒకరినొకరు నిస్వార్ధప్రేమతో ప్రేమించుకోవడం. రెండవది, ప్రార్ధనాజీవితానికి అలవాటుపడ్డం. మూడవది, క్రైస్తవ సంస్కారాలను యోగ్యంగా స్వీకరిస్తూ వుండడం, ఇక యీ మూడంశాలను విచారిద్దాం.

1. నిస్వార్థ ప్రేమ

భార్యాభర్తలు ఒకరినొకరు ఓ వరప్రసాదంగా భావించుకోవాలి. అనగా ఈ భార్య లేక ఈ భర్త, దేవుడు నాకనుగ్రహించిన వరప్రసాదం. ఈ వ్యక్తిద్వారా నేను పవిత్రతను పొందాలి. ఈ వ్యక్తిని నేను పవిత్రపరచాలి,

భార్యాభర్తలు విశేషంగా లైంగిక పావిత్ర్యాన్ని పెంపొందించుకోవాలి. లైంగిక పావిత్ర్యమంటే దంపతులు లైంగికక్రియలో నిస్వార్ధప్రేమతో ప్రవర్తించడం. లైంగిక సుఖం భార్యాభర్తలు ఇద్దరూ కలసి అనుభవించేది. ఇద్దరూ కలసి పాలుపంచుకోనేది. కనుక భర్త తాను సుఖించడంతో సరిపోదు. భార్యనూ సుఖపెట్టాలి. అలాగే భార్య తాను సుఖించడంతో సరిపోదు. భర్తనూ సుఖపెట్టాలి.

కాని తరచుగా భార్యాభర్తల్లో ఎవరోవొకరు, విశేషంగా పురుషులు, ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ వుంటారు. లైంగికక్రియలో తమ సుఖాన్ని తాము చూచుకొని ఎదుటివ్యక్తి సుఖాన్ని విస్మరిస్తూ వుంటారు. ఈ యెదుటి మనిషిగూడ నాలాగే ఓ వ్యక్తి నా సుఖంకోసం ఈ మానుషవ్యక్తిని ఓ వుపకరణంగా వాడుకోగూడదు. అలా వాడుకుంటే ఆ వ్యక్తిని ఓ వస్తువుగా ఉపయోగించుకొని అవమానించినట్లే. కేవలం స్వీయతృప్తి కోసమే భార్యను సమీపించే భర్తగాని, భర్తను సమీపించే భార్యగాని జంతువుల్లా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి. ఎదుటివ్యక్తిని ఆదరించని లైంగికక్రియ, ప్రేమలేని లైంగికక్రియ జంతువులకు యోగ్యమైతే ఔతుందేమోగాని నరులకు యోగ్యంగాదు.

అసలు ఆలుమగలు ఎదటి వ్యక్తినుండి సుఖాన్ని పొందడంగాదు, ఎదుటివ్యక్తికి సుఖాన్ని ఈయడమే తమ కలయిక యొక్క ధ్యేయం అనుకోవాలి. ఎదుటివ్యక్తి ప్రేమను అనుభవించడంగాదు, ఎదుటివ్యక్తిని ప్రేమించడమే ప్రధానం అనుకోవాలి. ఇది స్వార్థంలేని ప్రేమ. భార్యాభర్తలు అవశ్యం పెంపొందించుకోవలసిన ప్రేమ. ఈలాంటి నిస్వార్ధప్రేమ ద్వారాగాని దంపతులు "స్నేహితులకోసం స్వీయప్రాణాన్ని సమర్పించడంకంటె ఉత్తమ