పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగులోను చీకటిలోను ప్రభువుమీదనే ఆధారపడాలి. పెండ్లిపూజలో వధూవరులు “మంచిరోజుల్లోను చెడురోజుల్లోను, వ్యాధిలో వున్నపుడును ఆరోగ్యంగా వున్నపుడును ఒకరిపట్ల ఒకరం విశ్వాస యోగ్యంగా ప్రవర్తిస్తామని” పీఠంముందు ప్రమాణం చేస్తారు. భార్యాభర్తలు అక్షరాల ఈ భావానికి అనుగుణంగా జీవించవలసిన రోజులు వస్తాయి.

3. బిడ్డలులేని బ్రతుకు

ఒకోమారు సంతానం కలుగదు. అలాంటప్పడు స్త్రీ పురుషులు తీరనివ్యధను అనుభవిస్తారు. ఈలాంటి పరిస్థితిలో కొంతవరకు ఓదార్పుపొందే మార్గం ఇది. భార్యాభర్తలు పరస్పర ప్రేమనుగూడ సంతానంగానే భావించుకోవాలి. ఈ ప్రేమ తరచుగా భౌతికరూపందాల్చి సంతానమౌతుంది. కాని ఒకోమారు అలా రూపొందదు. ఆ పిమ్మట మన సొంతబిడ్డలపట్ల చూపే ప్రేమనే వేరేవాళ్ళ బిడ్డలపట్ల చూపుతూ వాళ్ళను ఆదుకొంటూండాలి.

4. వైధవ్యం

వైధవ్యం స్త్రీకి ఘోరవ్యధను కలిగిస్తుంది. ఐనా ఆమె క్రీస్తునందు ఈబాధ సహించాలి. విధవకు మళ్ళా పెండ్లి చేసికొనే స్వాతంత్ర్యం వుంది. కాని క్రీస్తునందు తన వైధవ్యాన్ని భరించే స్త్రీ ధన్యురాలు - 1కొ 7, 10. క్రీస్తునందు అనగా ప్రభువు ప్రజలకు పరిచర్యలు చేస్తూ అనిభావం. పరదేసులకు ఆతిథ్యమిస్తూ, పరిశుద్దుల పాదాలు కడుగుతూ, శ్రమపడేవారికి సహాయంచేసూ ప్రతి సత్కార్యానికి ముందుకివస్తూ, రోజులు సాగించమన్నాడు తననాటి విధవలను ప్రేషితుడైన పౌలు- 1తిమో 5,10. ప్రభువు తనకిచ్చిన సిలువను ఓర్పుతో భరించడం, ఇంటిలోను ఇరుగుపొరుగు వాళ్ళ ఇండ్లలోను వున్న బిడ్డలను ఆదరించడం, గుడిలోను బడిలోను పరిచర్య చేస్తూండడం, అనవసరపు ప్రసంగాలు మాని ప్రార్థన చేసికోవడం - ఇవి విధవలు చేయదగిన సత్కార్యాలు. అన్నావారికి ఆదర్శంగా వుంటుంది - లూకా 226-28.

5. తిరుకుటుంబం

కుటుంబ జీవితానికి ప్రభువు తానే ఆదర్శంగా నిలిచాడు. నజరేతు గ్రామం. తల్లిదండ్రులు మరియా యోసేపులు. వాళ్ళతో కలసిమెలసి పనిచేసే పసిపాపడు బాలయేసు. వాళ్లు ముగ్గురూ కష్టజీవులు. వడ్రంగి వృత్తితో జీవించేవాళ్ళ క్రైస్తవ కుటుంబాలు ఈ కుటంబంవైపు తేరిపార జూచి తమ రూపురేఖలు తీర్చిదిద్దుకోవాలి — లూకా- 2,51-52.