పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహజీవితంలో లైంగిక క్రియ ముఖ్యమైందే. కాని అది అన్నిటికంటె ముఖ్యమైంది కాదు. అదే మొదటి విలువకాదు. సంసారజీవితంలో శారీరకమైన కలయిక ఒక్కటే ముఖ్యంకాదని భార్యాభర్తలు కొద్దిరోజూల్లోనే గుర్తిస్తారు. జీవితంలో ఇంకా ముఖ్యవిషయాలు చాలా వున్నాయనీ వాటిమీదకూడ మనసుపెట్టి జీవించాలనీ అర్థంచేసికొంటారు. కనుక దంపతుల శృంగారం ఆదుపాజ్ఞల్లో వుండాలి. దాని స్థానం దానికుంది. కాని అది హద్దుమీరరాదు.

ప్రార్థనా భావాలు

1. వైవాహికానందం

వివాహ జీవితంలో ఎంతో ఆనందం వుంటుంది. భార్యాభర్తలు ఈ యానందాన్ని హాయిగా అనుభవించవచ్చు. స్త్రీ పురుషుల కలయిక ఆనందాన్నిస్తుంది. భర్త భార్య సౌందర్యాన్ని వినయ విధేయతలను జూచి ఆనందిస్తాడు. భార్య భర్త శక్తి సామర్థ్యాలను ప్రేమను మంచితనాన్ని చూచి ఆనందిస్తుంది. సంతానం కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తూంటే అదీ ఆనందమే. కష్టపడి పనిచేసికొంటూ తోడిప్రజలతో ఒద్దికగా జీవిస్తే అదీ ఆనందమే. నిర్మలమైన అంతరాత్మతో తోడిప్రజలకు కీడు చేయకుండ చేతనైనంతవరకు మేలు చేసికొంటూపోతే అదీ ఆనందమే. ఈ యానందాలన్నిటినీ అనుభవిస్తూ కృతజ్ఞతతో ప్రభువుకి వందనాలు అర్పించుకోవావలి సంసారజీవితం గడిపే స్త్రీపురుషులు. అప్పడే కందెన పెట్టిన బండి యిరుసులాగ సంసారజీవితం మెత్తగా సాగిపోయేది.

గురువు గురుజీవితంలో ఆనందిస్తాడు. మఠకన్యకన్యాజీవితంలో ఆనందిస్తుంది. అలాగే భార్యాభర్తలు సంసారజీవితంలో ఆనందించాలి.

2. దేహదానం

వివాహ ధర్మం ప్రకారం భార్య దేహం భర్తది. భర్తదేహం భార్యది. కావున భార్య కోరినపడెల్ల భర్త, భర్త కోరినపుడెల్ల భర్త, భర్త కోరినపుడెల్ల భార్య శారీరక సంబంధానికి అనుమతిస్తుండాలి. ఈ లైంగిక సంబంధం దంపతులను పవిత్రపరుస్తుంది —1కొరి 7,3-4 దేహదానమనే ఈ నియమాన్ని ఉల్లంఘించినవాళ్సు వివాహజీవితానికి విరుద్ధంగా పాపంజేసిన వాళ్ళవుతారు. ఇక, శారీరక సంబంధం భార్యాభర్తల మధ్య కలిగే కలహాన్నీ అపార్ధాన్నీ చక్కదిద్దుతుందని మానసికశాస్త్రవేత్తలు చెప్తారు.

3. స్వీయభార్య

సామెతల గ్రంథకర్త పురుషులకు చక్కని వైవాహిక ధర్మాలు బోధించాడు. "పురుషుడు సొంత పాత్రలోని నీళ్ళు త్రాగుతూండాలి. సొంతబావిలోని జలధారను