పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేవిస్తూండాలి. తాను యువకుడుగా వున్నపుడే స్వీకరించిన భార్యయందు ఆనందిస్తూండాలి. లేడిలా, దుప్పిలా ఆమె అతనికి అందంగా కన్పిస్తుంది. అతడు ఆమె ప్రేమకు బుద్ధుడు కావాలి. అతనికి సంతృప్తినిచ్చేది రంకులాడి రొమ్ముకాదు, నిజభార్య వక్షస్సు" - 5,15-20.

4. న్రీ సహజమైన వినయం

క్రైస్తవ స్త్రీకి వినయం తగుతుంది. చక్కని జడలు, బంగారు సొమ్ములు, ముత్యాలదండలు, వెలగలదుస్తులు - ఇవికాదు ఆమెకు అలంకారాన్ని ఇచ్చేది. అణకువ, దైవభక్తి సత్ర్కియలు - ఇవి క్రైస్తవ కుటుంబినికి పెట్టని సొమ్మలు - 1తిమో 2,9-10. ఆమె సాధుమతి మృదుస్వభావయై యుండాలి. ఈ గుణాలు ఆమె హృదయానికి అక్షయాలంకారాలు - 1పేత్రు 3,3-4 సార, రిబ్కా మొదలైన ఉత్తమస్త్రీలు ఈలాంటి గుణాలు కలవాళ్లు, క్రైస్తవ కుటుంబిని ఆదర్శాలు కూడ ఈలా వుండాలి. ఇంకా, స్త్రీ బిడ్డలను కనడంద్వారా ధన్యురాలవుతుంది - 1తిమో 2,15,

5. జంతమైథునం

జంతు మైథునంలో మృగాలు మొదట శారరీకసుఖాన్ని కోరుకొంటాయి. ఆ పిమ్మట వాటికి తెలియకుండానే యాదృచ్చికంగా పిల్లలు పుడతాయి. మనుష్య మైథునంలో మొదట సంతానం ఉద్దేశింపబడుతుంది. ఈ దృష్టితోనే శారీరకసుఖాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తలు ఈ సత్యాన్ని మరచిపోగూడదు.

6. క్రీస్తునందు

మనంచేసే పనులన్నీ కూడ క్రీస్తుపేరిట చేయాలన్నాడు ప్రేషితుడైన పౌలు- కొలో 3,17. తినడం, త్రాగడం, నిద్రించడం మొదలైన మామూలు కార్యాలన్నీ ప్రభువుకే అర్పించమన్నాడు. స్త్రీ పురుషులు తమ కలయికనుగూడ ప్రభువుకే అర్పించుకోవాలి.

8. సిలువ మార్గం

క్రీస్తు సిలువను మోయడం కష్టం. ఐనా దాన్ని మోసినప్పడేగాని క్రీస్తు శిష్యులం కాలేం. అన్ని దేవద్రవ్యానుమానాల్లోలాగే వివాహంలోకూడ క్రీస్తు సిలువబాధలూ ఉత్థాన మహిమా రెండూ వుంటాయి. ఇక్కడ మనం సిలువ బాధలను పరిశీలించాలి. క్రీస్తు స్వీయమరణంద్వారా తిరుసభనే పత్నిగా పొందాడు. ఈ స్వార్థత్యాగం మన వివాహజీవితంలోగూడ కన్పించాలి. భార్యాభర్తల ఆత్మార్పణం, వారి జీవితంలో ఎదురయ్యే వొడుదుడుకులు వాళ్ళ క్రీస్తు సిలువలో పాలుపొందేలా చేస్తాయి. ఎదుటి వ్యక్తికి ఆత్మార్పణం