పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. సత్కార్యాలకు ఉండవలసిన నియమాలు

మనం చేసే పనులు దేవునికి ప్రియపడాలంటే, అవి వరప్రసాదమనే బహుమానాన్ని పొందాలంటే, ఈ క్రింది మూడు నియమాలను పాటించాలి. ప్రేమభావం, క్రీస్తుతో ఐక్యంగావడం, ఉద్దేశ పారిశుద్ధ్యం. నరుడు వెలుపలి కార్యాలను మాత్రమే చూస్తాడు. భగవంతుడు హృదయాలను గూడ పరిశీలిస్తాడు. మనం ఏ వద్దేశంతో ఆయా పనులు చేస్తున్నామా అని కూడ పరిశీలించి చూస్తాడు. దేవునికి మన పనులతో అవసరం లేదు. బిడ్డలమైన మన ప్రేమభావం మాత్రం అతనికి ప్రియం గలిగిస్తుంది. అందుకే మనం ప్రేమభావంతో చేసిన పనులు మాత్రం ఆ ప్రేమమూర్తికి ప్రియం గలిగిస్తాయి. కావుననే ప్రభువు "బిడ్డా! నాకు నీ హృదయాన్ని ఈయి" అంటాడు. క్రీస్తు కేవలం మరణం ద్వారానే మనలను రక్షింపలేదు. అతడు తండ్రిపట్ల జూపిన విధేయత మనపట్ల జూపిన ప్రేమ కూడ మనలను రక్షించాయి. విధేయతతో ప్రేమతో సిలువపైకెక్కిన ప్రభువు ప్రతి కార్యంలోను మనకు మార్గదర్శకంగా వుండాలి.

ద్రాక్షలతతో ఐక్యమైయున్నంత వరకు మాత్రమే రెమ్మలు పూలుపూచి కాయలు కాస్తాయి. తల్లితీగనుండి వేరైన వెంటనే రెమ్మలు వాడిపోతాయి. మనమూ ఇంతే. క్రీస్తుతో ఐక్యమై యున్నంత వరకే సత్ఫలితాన్ని ఇస్తాం. కావున మనం చేసే పనులన్నీ క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు చేస్తూండాలి. క్రీస్తు ద్వారా ఎందుకంటే, అతనిద్వారాగాని పితను చేరలేం. క్రీస్తుతో ఎందుకంటే, మన కార్యాలను బహూకరించేది ప్రభువు ఆర్ధించిన వరప్రసాదాలే. క్రీస్తునందు ఎందుకంటే, చేప నీటిలోలాగ, పిండం మాతృగర్భంలో లాగ మనమూ నిత్యం క్రీస్తునందు జీవిస్తూంటాం. కావుననే పౌలు కొలోసా పౌరులకు వ్రాస్తూ "మీరు చేసే పనులన్నీ ప్రభు యేసు నామంమీదుగానే చేయండ"ని బోధించాడు -3,17.

దేహానికి ఆత్మ యేలాంటిదో మన కార్యకలాపాలకూ సదుద్దేశం ఆలాంటిది. ఆత్మం దేహంలోని అవయవాలన్నిటినీ ఒక్కటిగా సంధించి వానికి జీవ మిస్తుంది. ఉద్దేశ పారిశుద్ధ్యం కూడ మన పనుల నన్నిటినీ ఒక్కటిగా సంధించి అవి దేవునికి ప్రియపడేలా చేస్తుంది. ఉద్దేశ పారిశుద్ధ్యమంటే స్వీయ ప్రీతి కొరకుగాక, దైవప్రీతి కొరకు ఆయా పనులు చేస్తుండడం. ఒకే రకపు కాగితాలు రెండున్నాయి. ఒక దానిపై ప్రభుత్వంవారి ముద్రవుంది. అది నూరు రూపాలయ నోటు. విలువ కలది. రెండవదానిపై ఈ ముద్ర లేదు. కనుక దానికి ఏ విలువలేదు. చిత్తుకాగితాల బుట్టలో పడుతుంది, అంతే ఉద్దేశ పారిశుద్ధ్యం అనే ముద్రతోగూడిన మన పనులు ప్రభుత్వంవారి ముద్రపడిన కాగితంలాగ