పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విలువయైనవి.ఈ ముద్రలేని పనులకు దేవుని యెదుట ఏ విలువా లేదు. అందుకే మనం రోజురోజు ఈ సదుద్దేశాన్ని నూత్న పరచుకొంటూండాలి. రోజురోజు ఉదయం "ప్రభూ! నీకు ప్రియంగలిగించడానికే ఈ పనులను చేస్తున్నాను. వీటన్నిటిని భక్తితో నీకే సమర్పిస్తున్నాను" అని చెప్పకొంటూండాలి. జప అపోస్తలుల ప్రార్థనా పద్ధతికూడ దీనికి తోడ్పడుతుంది. ఆయా కార్యాలకు ముందు ప్రభు సాన్నిధ్యం కలిగించుకొని ప్రభునామం ఉచ్చరించడంగూడ మంచి పద్ధతి. “జ్ఞాని కొలది కాలంలోనే పరిపూరుడయ్యాడు. కనుక అతడు కొలది కాలంలోనే దీర్ఘకాలం జీవించాడు" అంటుంది సొలోమోను జ్ఞానగ్రంథం - 4,13. అనగానీతిమంతుల కార్యాలన్నీ పుణ్యమయం గావున వాళ్లు బహుకాలంలో ఆర్ధింపవలసిన పుణ్యాలను గూడ అనతికాలంలోనే ఆర్థించారని భావం. ఉద్దేశ పారిశుద్ధ్యంతో పనిచేసేవాళ్ళు ఈలాంటి జ్ఞానులుగా గణింపబడతారు.

3. పరసువేది

పరసువేది నంటిన లోహం బంగారం ఔతుంది. దాన్ని సాధించడానికై ప్రాచీనులు చాలమంది విశ్వప్రయత్నాలు చేసారు. అసలు ఈ పరసువేది అనే శిల ఒకటివుందో లేదో మనకు తెలియదు. కాని మన కార్యాలను మాత్రం బంగారంగా మార్చే పరసువేది ఒకటుంది. అదే జ్ఞానస్నానం, మనలను క్రీస్తుతో జోడించే సాధనం. ఓమారు జ్ఞానస్నానం ద్వారా ತಿನ್ನಿಟ್ ఐక్యమయ్యాయో, మన కార్యాలూ క్రీస్తు కార్యాలే ఐపోతాయి. మన జీవితమూ ఒక రీతిగా క్రీస్తు జీవితమౌతుంది.

మన యీదైనందిన కార్యాల ద్వారానే భావిమోక్షాన్ని పొందగలుగుతున్నాం. పొలం దున్నుకొనడం, పంటలు పండించుకోవడం, అన్నం వండుకోవడం, నిద్రించడం, బిడ్డలను కనడం ఈ రీతిగా మనం చేసే పనులు సామాన్యమైనవే కావచ్చు. ఐనా ఈ పనులు ద్వారానే క్రీస్తు కృపను బడసి, క్రీస్తు మహిమకు హక్కుదారులం కాగల్లుతూన్నాం. ఎందుచేత? క్రీస్తుతో ఐక్యం కావడం వలన. మంటిమీద జీవించే మన యీ జీవితం - అదియే మాదిరి జీవితమైనసరే - వ్యర్థంకాదు. గొప్ప ఓదార్పునీ, మనశ్శాంతినీ ప్రసాదించే సత్యం యిది.

ఫ్రాన్సిస్ శారివారివలె మనం దూరదేశాలకు వెళ్ళి క్రీస్తును బోధించలేం, అంటియోకయా ఇన్యాసి వారివలె సింహాలకు మేతైవేదసాక్షిగా మరణించలేం. తోమాసు అక్వినాసుగారివలె మేధాశక్తితో దైవశాస్తాంశాలను ప్రతిపాదించలేం. 23వ జాన్ పోపుగారివలె శ్రీసభలో ఉత్తేజకరమైన నూత్నభావాలను ప్రవేశపెట్టలేం. మదర్ తెరేసాలాగ సాంఘికసేవ చేయలేం. మనం పేదరికంలో పట్టి పేదరికంలోనే చనిపోవచ్చు మనం