పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరప్రసాదమంటే ముగ్గురు దైవ వ్యక్తులు మన హృదయంలో నెలకొనడం, దీనికే అంతర్నివాసం అని పేరు. దైవాత్మక వరప్రసాదం ముగ్గురు దైవవ్యక్తుల సాన్నిధ్యమైతే ఆ దైవవ్యక్త లిచ్చే బహూమానమే పవిత్రీకరణ వరప్రసాదం. ఈ రెండు వరప్రసాదాలూ అవినాభావ సంబంధం కలవి. అనగా ఒకటి ఉన్నచోట రెండవది కూడ ఉండితీరుతుంది. రెండు రకాలుగా వున్న ఈ శాశ్వత వరప్రసాదం, చావైన పాపం కట్టుకొనిన ఆత్మ యందు నిలువదు.

2. వరప్రసాదం ఏమి చేస్తుంది?

వరప్రసాదమంటే యేమిటి? అది మనలోని ఓ దివ్య గుణం. ఈ గుణంవలన మనం భగవంతునికి ప్రియపడతాం. ఈ గుణం దేవుడు మనకు ఉచితంగా యిచ్చేవరం. దానికి మనం ఏవిధంగాను అరులంకాము.

వరప్రసాదం చేసే పనులు చాలా వున్నాయి. దాని వలన మనకు పాపపరిహారం లభిస్తుంది. మనం నీతిమంతులమై దేవునితో రాజీపడతాం. పాపంతో వున్నపుడు దేవునికి విరోధులమై అతనికి అప్రియం కలిగిస్తాం, వరప్రసాదం వలన పావిత్ర్యాన్ని గూడ పొందుతాం.

వరప్రసాదం ద్వారా దేవునికి దత్తపుత్రుల మౌతాం. అతడు మనకు నిజంగా తండ్రి ఔతాడు. పిత పత్ర పవిత్రాత్మలనే ముగ్గురు దైవవ్యక్తులు మన హృదయంలో వసించడం మొదలిడతారు. మనకు దివ్యత్వం లభిస్తుంది.

ఈ వరం ద్వారా మనం విశేషంగా క్రీస్తుతో ఐక్యమై అతని దివ్యజీవితం జీవిస్తాం. కొమ్మలు చెట్టుతో లాగ అతనితో ఐక్యమౌతాం. ఆ క్రీస్తుతో ఐక్యమైన తోడిజనంతోగూడ ఐక్యమై ప్రేమజీవితం జీవిస్తాం.

మోక్షం తండ్రి రాజ్యం. ఆ తండ్రికి బిడ్డలమైన మనం వరప్రసాదం ద్వారా మోక్షానికిగూడ వారసుల మౌతాం.

వరప్రసాద ఫలితాలు ఇన్ని వున్నాయి. ఈ విషయాలన్నిటినీ రాబోయే అధ్యాయాల్లో విపులంగా పరిశీలిస్తాం. ప్రస్తుతానికి పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి విచారిద్దాం.

3. ట్రెంటు మహాసభ బోధలు

ప్రోటస్టెంటు సోదరుల తిరుగుబాటును పురస్కరించుకొని బ్రెంటు మహాసభ 16వ శతాబ్దంలో సమావేశమైంది. అందుచేత ఈ సభ ప్రతిపాదించిన సత్యాలన్నీ ప్రత్యక్షంగానైతేనేమి పరోక్షంగా నైతేనేమి ప్రోటస్టెంటుల నూత్న సిద్దాంతాలను