పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయసూచిక

1. పవిత్రీకరణ వరప్రసాదం 253 2. నరుడు దివ్యడు 260 3. దత్తపత్రుడు 266 4. అంతర్నివాసం 271 5. దివ్యవ్యక్తులతో బాంధవ్యాలు 275 6. సహాయక వరప్రసాదం 279 7. సహాయక వరప్రసాదాలు మూడు 282 8. సహాయక వరప్రసాదాలు మరో మూడు 288 9. జ్ఞానదేహం 293 10. సత్ర్కియలు 296 11. హిందూ సంప్రదాయం 301 -ప్రశ్నలు 305

1. పవిత్రీకరణ వరప్రసాదం

జ్ఞానస్నానంతో వరప్రసాద జీవితం ప్రారంభమౌతుంది. ఇక్కడ వరప్రసాదమంటే యేమిటో, అదెలా వుంటుందో విచారిద్దాం. ప్రస్తుతాధ్యాయంలో ఐదంశాలను విలోకిద్దాం.

1. భావవిభాగం

వరప్రసాద భావంలో చాలా విభాగాలున్నాయి. వరప్రసాదాలన్నీ శాశ్వత వరప్రసాదాలూ తాత్కాలిక వరప్రసాదాలూ అని రెండు విధాలుగా వుంటాయి. ল’ৰ্ক্সতঁ వరప్రసాదం ఓమారు మనలో నెలకొన్నంక, చావైన పాపం కట్టుకొనని యంతవరకు మనలో స్థిరగా నిలచివుంటుంది. అందుకే దీనికి ল’ৰ্ছঃ వరప్రసాదం లేక స్థిర వరప్రసాదం అని పేరు. కాని తాత్కాలిక వరప్రసాదం ఈ శాశ్వత వరప్రసాదంలాగ స్థిరంగా నిలువదు. తాత్కాలికంగా మాత్రమే వుండి మనలను ఆయా పుణ్యకార్యాలకు పరికొల్పుతుంది. ఈ తాత్కాలిక వరప్రసాదానికే సహాయక వరప్రసాదమని కూడ పేరు.

ఇకశాశ్వత వరప్రసాదం మరల పవిత్రీకరణ వరప్రసాదం, దైవాత్మక వరప్రసాదం అని రెండు రకాలుగా వుంటుంది. పవిత్రీకరణ వరప్రసాదం క్రొత్త పట్టువు నిచ్చి మనలను పవిత్ర పరుస్తుంది. మన పాపాలను హరిహరిస్తుంది. దివ్యత్వాన్నిచ్చి మనలను దేవుని బిడ్డలను చేస్తుంది. మనలను మోక్షానికి హక్కుదారులను గావిస్తుంది. దైవాత్మక