పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురస్కరించుకొని వెలువడినవే. వరప్రసాదాన్ని గూర్చిన బ్రెంటు సభ బోధలను గూడ ఈ దృష్టితోనే పర్యవేక్షించాలి.

పవిత్రీకరణ వరప్రసాదాన్ని గూర్చి ట్రెంటు సభ మూడు ముఖ్య విషయాలను బోధించింది. అవి యివి. 1. నీతిని పొందడమంటే దేవుడు మన పాపాలను యథార్థంగా మన్నించడం. 2. నీతిని పొందడమంటే ఆత్మ క్రొత్తతనాన్ని పొందడం. 3. నీతిని పొందడంలో మన సహకారం కూడ వుంటుంది. ఈ మూడు విషయాలు నీతిని పొందడం అనే సత్యాన్ని వివరించే సందర్భంలో బోధింపబడ్డాయి. ඕෂීඩ් ඕශoඨස්කoභී జ్ఞానస్నానంద్వారా పాపాన్ని విడనాడి పవిత్రతను పొందడం. పాపం ద్వారా సిద్ధించే దైవశత్రుత్వాన్నుండి తప్పకొని పవిత్రీకరణ వరప్రసాదంద్వారా దైవ మిత్రత్వాన్ని పొందడం.

1. లూతరు సిద్ధాంతం ప్రకారం నీతిని పొందినంక గూడ మన పాపాలు యథార్థంగా పరిహారం కావు. మనకు దేవునిమీద ప్రేమా నమ్మికా వున్నట్లయితే ఆ దేవుడు మనలను చల్లని చూపుతో జూస్తాడు. క్రీస్తు సిలువమరణం వలన ఆర్థించిన వరప్రసాదాలతో మన ఆత్మను కప్పి అలంకరిస్తాడు. ఈ యలంకరణం ద్వారా మన ఆత్మం స్వయంగా పాపభూయిష్టమైయున్నాదేవుని సముఖంలో మాత్రం ప్రియంగొల్పుతూనే వుంటుంది.

బ్రెంటు సభ ఈ నూత్న వాదాన్ని ఖండించి ఈలా బోధించింది. నీతిని పొందడమంటే దేవుడు మన యాత్మను క్రీస్తు వరప్రసాదాలనే వస్త్రంతో కప్పివేయడం . యథార్థంగా పాపాలనుండి మన్నింపును పొందడం. ఈ మన్నింపు వలననే మనం నీతిమంతులం కాగల్లుతున్నాం.

నరుడు పట్టుకతోనే తొలి ఆదాము పాపంతో జన్మిస్తున్నాడు. పట్టుకతోనే దేవునికి శత్రువూ అప్రియుడూ ఔతున్నాడు. కాని మలి ఆదామునందు జ్ఞాకస్నానం పొంది మలి పుట్టువును పొందుతున్నాడు. దేవునికి దత్తపుత్రుడు ప్రియసుతుడు ఔతూన్నాడు.

2. లూతరు తలంపు ప్రకారం నీతిని పొందడమంటే ఆత్మను క్రీస్తు వరప్రసాదంతో కప్పివేయడం అన్నాం. అంచేత నీతిని పొందినాక గూడ మన ఆత్మయందు వస్తుతః ఏ మార్పూ కలుగదు. నీతిని పొందిన పిదప గూడ ఆత్మపాపం నుండి విముక్తి చెందదు. మనలోని ఆశాపాశాలు కూడ పాపాలే. ఈ యాశాపాశాలు మనం జీవించినంత కాలమూ వుంటాయి కనుక మన యాత్మ కూడ నిత్యం పాపంలోనే జీవిస్తుంటుంది. మరి మనకు రక్షణ లభించేది ఎలాగంటే, మన ఆత్మను వస్త్రంలాగ కప్పివేసిన క్రీస్తు వరప్రసాదంద్వారా, ఈ వరప్రసాదాలను చూచి క్రీస్తుపైగల ఆదరంచే పరలోకపిత మనలను చల్లని చూపున జూస్తాడు. మనలను తనసముఖంలోనికి చేర్చుకొంటాడు.