పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివరించి చెప్పాడు. యితియోపీయుడు అతని బోధను విశ్వసించి జ్ఞానస్నానం పొందాడు. అతనిలాగే మనమూ దైవవాక్య బోధను నమ్మికతో ఆలించాలి - అచ 8, 26-40.

4. ప్రభో! నీవు నా కండ్లు తెరువు అప్పడు నేను నీ ధర్మశాస్త్రం బోధించే అద్భుత సత్యాలను తెలిసికొంటాను - కీర్త 119,18.
5. ప్రభో! నీ దాసుడు ఆలించడానికి సిద్ధంగానే వున్నాడు. సెలవీయి - 1 సమూ 3, 10.
6. ఇద్దరు ముగ్గురు నా పేరుమీదుగా సమావేశమైన కాడ నేనూ నెలకొని వుంటాను - మత్త 18,20.

(4) భక్తుడు దైవాక్కును ధ్యానించుకోవాలి

1. ప్రభో ! నేను నీ ఉపదేశాలను ధ్యానించుకొంటున్నాను - కీర్త 119, 78.
 2. నేను పడకమీద పండుకొని నిన్ను స్మరించుకొంటూంటాను - 63, 6.
 3. ప్రభువు కట్టడలను రేయింబవళు మననంబేసికొంటూ ఆనందించే నరుడు ధన్యుడు అతడు ఏటియొడ్డున పెరిగే చెట్టులాంటివాడు అది సకాలంలో పండ్లనిస్తుంది దాని యాకులు వాడిపోవు ఆలాగే అతడుకూడ సఫలుడౌతాడు 1, 2-3
 4. మరియు ఆ సంగతులన్నీ హృదయంలో పదిలపరచుకొని మననం జేసికొంటూండేది - లూకా 2, 29-251.

(5) భక్తుడు ప్రభువాక్యాన్ని పాటించాలి

1. ఒకడు పొలంలో విత్తనాలు వెదజల్లాడు. కొన్ని విత్తనాలు త్రోవలో పడగా పక్షులు వాటిని ఏరుకొని తినేసాయి. కొన్ని విత్తనాలు రాతినేలపైబడి మొలిచాయి. కాని అవి వేరు పాతుకోలేనందున ఎండవేడి తగిలి మాడిపోయాయి. కొన్ని విత్తనాలు ముండ్లపొదల్లోబడి మొలిచాయిగాని ముండ్లుకాస్త వాటిని అణచివేసాయి. కొన్ని మాత్రమే సారవంతమైన నేలలోపడి ముప్ఫైయంతలూ అరవైయంతలూనూరంతలూ ఫలించాయి.