పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. ప్రవక్త యెహెజ్కేలు ప్రభుగ్రంథాన్ని భక్షించగా అది అతని నోటికి తేనెవలె తీయగా వుంది - యెహెజ్కేలు 3,3

10. పాలు శిశువును పోషించినట్లే దైవవాక్కు భక్తులను పోషిస్తుంది - 1 పేత్రు 2,2.

(3) వాక్యాన్ని వివరించి చెపూండగా భక్తితో ఆలించాలి.

1. క్రీస్తు ఉత్తానానంతరం ఇద్దరు శిష్యులు ఎమ్మావుకు వెళూన్నారు. వాళ్లకింకా ప్రభువు ఉత్థానమయ్యాడని తెలీదు. పైగా వాళ్లు క్రీస్తు రోమను ప్రభుత్వంతో యుద్ధంచేసి పాలస్తీనా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టకుండానే చనిపోయాడుగదా అని నిరుత్సాహంగా ఉన్నారు. త్రోవలో క్రీస్తు వాళ్లను కలిసికొన్నాడు. అయినా వాళ్ళతన్ని గుర్తుపట్టలేదు. క్రీస్తు రాజకీయాల్లో జోక్యంచేసికోవడానికి రాలేదనీ, అతడు మొదట బాధలననుభవించి అటుపిమ్మట మహిమను పొందుతాడనీ ప్రవక్తలు వచించారని ప్రభువు వాళ్లకు తెలియజెప్పాడు. తరువాత ఎమ్మావు చేరుకొన్నంక క్రీస్తు రొట్టె విరుస్తుండగా శిష్యులతన్ని గుర్తుపట్టారు. దానితో ప్రభువు అదృశ్యుడయ్యాడు. తరువాత ఆ ఇద్దరు శిష్యులూ యెరూషలేముకు తిరిగివస్తూ "ఆయన మార్గంలో మనతో మాట్లాడుతూ లేఖనాలను వివరించి చెపూంటే మన హృదయం భక్తిపారవశ్యంతో నిండిపోలేదా? అనుకొన్నారు. ప్రభువు వాక్యాన్నిగాని ఆ వాక్యాన్ని గూర్చిన బోధనుగాని వింటూన్నపుడు మనకుగూడ ఈలాగే భక్తిపారవశ్యం కలగాలి — లూకా 24, 32.

2. ఓమారు ప్రభువు మరియామార్తల ఇంటికి వచ్చాడు. మార్త ప్రభువుకి భోజనం సిద్ధంజేయడంలో సతమతమౌతుంది. కాని మరియు మాత్రం ప్రభు పాదాల దగ్గిరే కూర్చుండి స్త్రిమితంగా ఆయన బోధ వింటూంది. మరియనుగూడ వంటపనికి పంపమని మార్త ప్రభుని అడిగింది. అయినా ప్రభువు ఆమెను పంపలేదు. మరియు ఉత్తమమైన కార్యాన్ని ఎన్నుకొందని ఆమెను సమర్ధించాడు. ఈ మరియలాగే మనమూస్త్రిమితంగా ప్రభు వాక్యాన్ని వినాలి — లూకా 10, 38–42.

3. ఇతియోపీయుడు రథంమీద గూర్చుండి హిబ్రూ బాషలో యెషయా ప్రవచనం చదువుకొంటూన్నాడు. "అతన్ని ఓ గొర్రెపిల్లగా వధ్యస్థానానికి నడిపించుకొని వెళ్లారు. అయినా అతడు పల్లెత్తి మాటాడలేదు" - అనే వాక్యం దగ్గరికి వచ్చేప్పటికల్లా ఇతియోషీయునికి ప్రవక్త యెవరినిగూర్చి - ఈలా చెప్తున్నాడబ్బా అని సందేహం కలిగింది. అప్పడు ఫిలిప్ప అతన్ని కలిసికొని అదేవాక్యం ఆధారంగా తీసికొని క్రీస్తుని గూర్చి బోధించాడు. అలా పల్లెత్తి మాట్లాడకుండా వధ్యస్థానానికి వెళ్ళిన మహానుభావుడు క్రీస్తేనని