పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన హృదయం ఈ చివరన పేర్కొన్న సారవంతమైన నేలలా ఉండాలి. అప్పడే దైవ వాక్యం మన జీవితలో ఫలితమిచ్చేది - మత్త 12,4-8.

2.ఓ అతని రాతిపునాదిమీద యిల్లకట్టాడు. గాలి వీచి వాన కురిసి వరదలు వచ్చాయి.అయినా ఆ యింటి పునాది కదలలేదు. ఇల్లు సురక్షితంగానే ఉండిపోయింది. ప్రభు వాక్కు విని దాన్ని పాటించేవాడు ఈ బుద్ధిమంతుని లాంటివాడు. మరో అతని యిసుక పునాదిమీద ఇల్లు గట్టాడు. గాలివీచి వానకురిసి వరదలు వచ్చాయి. ఆ యింటి పునాదికాస్త కొట్టుకొనిపోగా యిల్లుకూడ కూలిపోయింది. ప్రభువాక్కును విని దాన్ని పాటించనివాడు ఈ మందమతిలాంటివాడు. - మత్త 7, 24-27.

3.ఓ అతని అద్దంలోకి చూచుకొని తన ముఖం అశుభ్రంగా ఉందని తెలుసుకొన్నాడు. వెళ్లి ముఖం కడుగుకొందామని పదడుగులు వేసాడు. కాని అంతలోనే తాను అద్దంలోకి చూచుకొన్న సంగతి ముఖం కడుగుకొందామనుకొన్న సంగతీపూర్తిగా మరచిపోయాడు. ఆ యేబ్రాసి మొగంతో అలాగే తిరుగుతున్నాడు. అదేవిధంగా మనం కూడ ప్రభు గ్రంథమనే అద్దంలోనికి చూచుకొన్నపుడు మన హృదయం ఎంత వికృతంగా ఉందో తెలిసిపోతుంది. ఆ గ్రంథంలోనికి చూచుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. కనుక కేవలం వాక్యం విని మరచిపోతే లాభంలేదు. దాన్ని ఆచరణలో పెట్టగలిగి ఉండాలి - యాకో 1, 22-25.

4.ప్రభువాక్కుని పాటించేవాళ్లని అతడు తన సొంత తల్లిలాగ, సొంత సోదరుల్లాగ భావిస్తాడు. అనగా వాళ్ల క్రీస్తుకి ఆత్మబంధువులూ ప్రీతిపాత్రులూ ఔతారని భావం - లూకా 8, 19, 21.

(6) వాక్యపఠనంవలన కలిగే ఫలితాలు

1. నరుడు ఆహారంతో మాత్రమే జీవించడు. ప్రభువు నోటినుండి వెలువడే ప్రతిమాటద్వారాగూడ జీవిస్తాడు - ద్వితీ 8,3. యథార్థంగా భూమిమీద పైరుపంటలు నరులను పోషింపలేవు. ప్రభుని నమ్మిన జనాన్ని పోషించేది అతని నోటిమాటలే

- సొలోమోను16,26.

2.ప్రభువు నోటినుండి వెలువడేమాటలు నిత్య జీవమిస్తాయి - యోహా 6, 68. 3.ప్రభువు ధర్మగ్రంథాన్ని అనాదరంజేసేవాళ్లు మృత్యువు వాతబడతారు - කාර්යංතිය 4,1.