పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3) నేను విత్తనం నాటాను. మొక్కమొలిచింది. అపొల్లో వచ్చి మొక్కకు నీళ్ళ పోసాడు. కాని ఆ మొక్క పెరిగేలా చేసేదేమో దేవుడే - 1 కొరి 3.6.

25. దంపతులు

దంపతులకు ఒకరిపట్ల ఒకరికి ప్రేమా గౌరవమూ ఆదరమూ ఉండాలి. ఈ గుణాలు లేందే యిద్దరు వ్యక్తులు జీవిత కాలమంతా కలిసిమెలిసి వుండలేరు. కుటుంబ జీవితంతో సతమతమయ్యే ఆలుమగలు బైబులు దంపతులు ప్రదర్శించే ఆదర్శాలను జాగ్రత్తగా గమనించాలి.

1. దేవుడు మొదట ఆదామని సృజించాడు. అతడు ఒంటరిగా ఉండిపోయాడు. ప్రభువు ఆదామునకు తోడుగా ఉండడానికి ఓ స్త్రీని చేద్దామనుకొన్నాడు.ఆదామని నిద్రబుచ్చి అతని ప్రక్కటెముక నుండి స్త్రీని తయారుచేసాడు.ఆ స్ర్తీని ఆదామునకు చూపించాడు. ఆదాము ఏవనుచూచి ఈమె నా యెముకల్లో యెముక, నా దేహంలో ධීක්‍ෂිය అనుకొన్నాడు. అనగా ఆమె తనకు దగ్గరిచుట్టమూ ఆపరాలూ అని భావం - ఆది 2, 23-24.

2. యాకోబు తన అన్నయయిన ఏసావునుండి పారిపోయి మేనమామ లాబానునింట తలదాచుకున్నాడు. అతనికి లాబాను కొమార్తె రాహేలపై మనసుపోయింది.ఆమెను పెండ్లి యాడ్డంకోసం మేనమామకు ఏడేండ్ల జీతంచేసాడు.రాహేలు మీదగల వలపుచే ఏడేండ్లగూడ ఏడు గడియల్లాగ సాగిపోయాయి. ఇంత అయినా లాబాను యాకోబున కిచ్చింది రాహేలు అక్క లెయానుగాని రాహేలునుగాదు. అతడు రాహేలు కోసం ఇంకో ఏడేండ్ల జీతంచేయడానికి ఒప్పకొన్నాడు. యాకోబుకు రాహేలు మీద ఉన్న ప్రేమ అంత గాఢమైంది - ఆది 29, 20.

3. ఎల్మానాకు అన్నా పెనిన్నా అని ఇద్దరు భార్యలు. పెనిన్నాకు ఇద్దరు బిడ్డలు కలిగారుగాని అన్నాగొడ్రాలుగా ఉండిపోయింది. ఈ యలుసు చూచుకొని పెనిన్నా అన్నాను ఎగతాళిచేసి యేడ్చిస్తూండేది. ఆ రోజుల్లో ప్రభువు గుడారం షిలోలో ఉండేది. ఎల్మానా అతని యిద్దరు భార్యలూ షిలోలో ఉన్న ప్రభువుని సేవించుకోవడానికై యాత్ర వెళ్ళారు. బిడ్డలు కలగలేదన్న విచారంతో అక్కడ అన్నా పెద్దగా దుఃఖించింది. అన్నం తినడంగూడ మానివేసింది, ఎల్మానా ఆమెనోదార్చాడు."అన్నా! ఈ ఏడ్పు ఈ దిగులు దేనికి? నేను నీకు పదిమంది కుమారుల పెట్టుకాదా? నీకు నా ప్రేమ చాలదా?" అని ఆమెను బుజ్జగించాడు. తరువాత ప్రభువు దయవలన ఆ దంపతులకు సమూవేలు అనే కుమారుడు కలిగాడు - సమూ 1, 6-8.