పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ఈసాకు రిబ్మాను వివాహమాడాడు. ఆమెను నిండు హృదయంతో ప్రేమించాడు. కాలు క్రిందపెట్టనీకుండ చూచుకొన్నాడు. అప్పటికి ఈసాకు తల్లి సారా చనిపోయింది. కాని అతడు రిబ్మావల్ల తల్లిలేని కొరతదీరి ఊరడిల్లాడు - ఆది 24, 67.

5. యూదితు యిప్రాయేలీయుల ఆడపడుచు, విధవ. చాల ప్రజ్ఞావంతురాలు. ఆమె యెరూషలేముమీదికి దండెత్తి వచ్చిన హోలోఫెర్నెసు అనే శత్రుసైన్యాధిపతి శిరస్సు తెగనరుకుకొనివచ్చి పట్టణాన్ని కాపాడింది. యూదితు సౌందర్యాన్ని సాహసాన్నిజూచి చాలమంది ఆమెను పెండ్లియాడాలని ఉవ్విళూరారు. కాని ఆ ధీరురాలు గతించిన తనభర్త మనా షేను స్మరించుకొంటూ రెండవ పెండ్లిమానివేసింది. వైధవ్యంతోనే స్వీయగ్రామమైన బెతూలియాలో రోజులు వెళ్లబుచ్చింది. భర్తపట్ల ఆమె చూపిన గాఢానురాగాం ఆలాంటిది – యూదితు 16, 22.

6. సౌలు తన కొమార్తె విూకాలును దావీదుకిచ్చిపెండ్లిచేసాడు. ఓ రాత్రిదావీదు విూకాలు యింటిలో ఉండగా సౌలు అతన్ని చంపివేయాలనుకొన్నాడు. ఆ రాత్రి ఆమె యింటికి కాపంచాడు. ఉదయాన్నే దావీదును చంపించాలని అతని పన్నాగం. కాని విూకాలు నేర్పుతో ఆరాత్రేదావీదుని కిటికీగుండా వెలుపలికి దింపింది. అతడు సౌలుకు దొరకకుండా పారిపోయాడు 1సమూ 19, 11-12.

7. దావీదు ప్రవాసంలోవుండగా కర్మెలు కొండపై నాబాలు అనే సంపన్నుడయిన కాపరి ఉండేవాడు. దావీదు తిరిపెంకోసం తన అనుచరులను అతని వద్దకు పంపాడు. కాని నాబాలు వట్టి మూర్ఖడు. అతడు దావీదు జనాన్ని అవమానపరచి వెనుకకు పంపాడు. కనుక దావీదు అతని యనుచరులూ నాబాలుని మట్టపెట్టడానికి పయనమై వస్తున్నారు. కాని నాబాలు భార్య అబిగాయిలు చాల తెలివితేటలుకలది. ఆమె యీ సంగతంతా తెలిసికొని గబగబ కానుకలు సిద్ధం చేసికొనివచ్చి త్రోవలో దావీదును కలసి కొంది. మూర్ఖుడైన తన పెనిమిటిని మన్నించమని వేడుకొంది. ఆమె ముఖంజూచి దావీదు నాబాలును క్షమించి వదలివేసాడు. ఆ రీతిగా ఆమె ఆనాడు పెనిమిటి ప్రాణాలు కాపాడింది. తరువాత నాబాలు చనిపోగా దావీదు ఆమెను పెండ్లియాడాడు - 1సమూ 25, 32-35.

8. స్నాపక యోహాను తల్లిదండ్రులు ఎలిసబేత్త జకర్యాలు. ఎలిసబేత్త గొడ్రాలుగా వుంది. అయినా ఆ భార్యాభర్తలు నిర్మల జీవితం జీవిస్తూండేవాళ్లు, దేవుని అజ్నలు పాటిస్తూండేవాళ్లు, వృద్దులైన ఆ పుణ్యదంపతులకు తర్వాత యోహాను పట్టాడు 1, 5–7.

26. పశ్చాత్తాపము

నరులు బలహీనతలవల్ల పాపంచేస్తూంటారు. కాని భగవంతుడు పాపాన్ని అసహ్యించుకొన్నంతగా మరిదేన్నీ అసహ్యించుకోడు. అతడు మహా పవిత్రుడైన దేవుడు.