పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. ఓ యజమానుడు దేశాంతరమెళూ తన సేవకులను ముగ్గురిని పిలిచి వాళ్లకు ధన మప్పగించాడు. ఒకనికి అయిదు సంచులూ, మరొకనికి రెండు సంచులూ, ఇంకొకనికి ఒక సంచీ యిచ్చి వెళ్ళాడు. యజమానుడు తిరిగి వచ్చేప్పటికల్లా అయిదు సంచులు తీసికొన్నవాడు ఇంకా అయిదు సంచులూ, రెండు సంచులు తీసికొన్నవాడు ఇంకా రెండు సంచులూ డబ్బు సంపాదించి ఉంచారు. కాని ఒకసంచి డబ్బు తీసికొన్నవాడు మాత్రం వొట్టినే ఉండిపోయాడు. ప్రభువు అతన్ని కోపగించుకొన్నాడు. అతని డబ్బుకూడ తీసికొని మొదటివాని కిచ్చేసాడు. కొందరు భగవంతుడు తమకిచ్చిన శక్తిసామర్థ్యాలను వృద్ధిచేసి కొంటారు. కొందరు అలా వృద్ధిచేసికోరు - మత్త 25,24-80.

18. ప్రభువు చాలామంది శిష్యులను పిల్చాడు. సుంకపు మెట్టులో పన్నులు వసూలు చేస్తున్న మత్తయిని పిల్చాడు. అతడు తాను లెక్కబెట్టుకొనే డబ్బుగూడ వదలిపెట్టి వెంటనే క్రీస్తుని అనుసరించాడు. అలాగే ప్రభువు ధనిక యువకుణ్ణి గూడ పిల్చాడు. కాని అతడు చాల ఆస్తిపాస్తులు కలవాడు. తన సిరిసంపదలను వదలుకోవడానికి అతనికి మనసురాలేదు. అందుచేత ఆ యువకుడు ప్రభుని అనుసరించలేక బాధపడుతూ వెళ్ళిపోయాడు. భగవంతుని పిలుపునీ ప్రబోధాన్నీ ఆలించేవాళ్ళు కొందరు, పెడచెవిని బెట్టేవాళ్ళు కొందరు - మత్త 9,9 ; లూకా 18,23.

19. అంతరాత్మ

నరుల్లో అంతరాత్మ అంటూ ఉంది. ఇది భగవంతుడు హృదయాల్లో నిల్పిన ఓ దీపంలాంటిది. ఈ యంతరాత్మ పాడుపనులు చేస్తుంటే హెచ్చరిస్తుంది. మంచిపనులు చేస్తుంటే మెచ్చుకొంటుంది. నరుడు మనస్సాక్షి ప్రబోధం వింటే దేవుని ప్రబోధం విన్నట్లే.

1. యోసేపు సోదరులు ధాన్యం కొనితెచ్చుకోవడానికి ఐగుప్శనకు వెళ్లారు. అక్కడ యోసేఫే పెత్తనదారుడు. అతడు అన్నలను గుర్తుపట్టాడు గాని వాళ్లు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు అన్నల చిత్తశుద్ధిని పరీక్షించడానికి గూఢచారులన్న నేరంతో వాళ్ళను చెరలో వేయించాడు. అప్పుడా సోదరులు "ఆనాడు మనం తమ్మునికి కీడు తలపెట్టాం. వాడు ఎంత బతిమాలినా మనం వాడిగోడు విన్పించుకోలేదు. వాడిఉసురుకొట్టి యిప్పుడు ఈ కడగండ్ల పాలయ్యాం" అని అనుకొన్నారు. సోదరునికి చేసిన అపరాధానికిగాను వాళ్ల అంతరాత్మ వాళ్ళను నిందించింది. ఆది 42,21.

2. ఓ మారు క్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నాడు. అప్పుడు యూదులు వ్యభిచారంలో పట్టుపడిన ఓ స్త్రీని అతని వద్దకు తీసికొని వచ్చారు. మోషే ఆజ్ఞాపించినట్లుగా ఆమెను రాళ్ళతో కొట్టి చంపవచ్చాఅని అడిగారు. అందుకు ప్రభువు "మీలో పాపంలేనివాడు