పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. అబ్రాహాము తమ్ముని కొడుకయిన లోతుకూడ అతని వెంట వచ్చాడు. వాళ్ళిద్దరూ కనానుమండలంలో మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లారు. ఇద్దరికీ గొర్రెల మందలూ గొడ్లమందలూ కావలసినన్ని వున్నాయి. క్రమేణ అబ్రాహాము జీతగాళ్ళకూ లోతు జీతగాళ్ళకూ తగాదాలు వచ్చాయి. అది చూచి అబ్రాహాము లోతుతో "మనం ఆయినవాళ్ళం. మనలో మనకు ఈలాంటి జగడాలా? ఇక మనం వేరుపడ్డం మంచిది. మనముందు కావలసినంత దేశముంది. నీవు ఎడమవైపుకుబోతే నేను కుడివైపుకు వెల్తాను లేదా నీవు కుడివైపు జరిగితే నేనే ఎడమవైపుకు జరుగుతాను" అన్నాడు. అపుడు లోతు తూర్పువైపునకు జరిగాడు. కనుక అబ్రాహాము పడమటివైపునకు వెళ్ళిపోయాడు. ఆవిధంగా వాళ్ళ తగాదా సమసిపోయింది - ఆది 13, 9–11.

3. మోషే యితియోపియను వధువును పెండ్లిచేసికొన్నాడు. మోషే సోదరియైనమిర్యాముకూ ఈమెకూ పడలేదు. కనుక మిర్యాము అన్నయైన అహరోనునిగూడ చేరదీసికొని మోషేమీద కలహానికి దిగింది - సంఖ్యా 12, 1-2

4. పౌలు బర్నబా స్నేహితులు. వాళ్ళిద్దరూ రెండవ ప్రేషిత ప్రయాణానికి బయలుదేరారు. బర్నబా తన బంధువూ సువిశేషకారుడూ ఐన మార్కునుగూడ వెంటబెట్టుకుని వెళ్లామన్నాడు. కాని దానికి పౌలు సమ్మతించలేదు. ఈ మార్కు మొదటి ప్రేషిత ప్రయాణంలో పౌలుతో పయనమై పోయాడు. కాని పంఫీలియా అనే పట్టనం వరకూ వెళ్ళి అమ్మమీద దిగులు పుట్టగా అక్కడినుండి వెనక్కువచ్చేసాడు. అలా చేయడం పౌలుకు నచ్చలేదు. కనుక అతడు మళ్ళా రెండవ ప్రేషిత ప్రయాణంలో మార్కును తీసికొని వెళ్ళడానికి అంగీకరించలేదు. ఈ విషయమై పౌలు బర్నబాలు గట్టిగా వాదించుకొని ఒకరి నుండి ఒకరు విడిపోయారు. తర్వాత పౌలు మార్కును క్షమించాడు - అచ 15, 、36一40.

5. పౌలు క్రీస్తుతో మోషే ధర్మశాస్త్రం అంతరించిందని ఇపుడు మనలను రక్షించేది ఉత్థాన క్రీస్తేగాని ధర్మశాస్త్రం కాదని బోధించాడు. తోలినాటి యూదక్రైస్తవ సమాజానికి ఈవాదం నచ్చలేదు. వాళ్ళనాయకుడు యాకోబు. ఇతడు క్రీస్తు బంధువు. యూదసమాజంలో పలుకబడి కలవాడు, యెరూషలేములోని యూద క్రైస్తవులంతా ఇతన్ని సమర్ధించారు. కాని అంటియోకయలోని గ్రీకు క్రైస్తవులంతా పౌలును సమర్ధించారు. పేత్రు లోలోపల పౌలు వాదాన్ని నమ్మినా బయటికి మాత్రం, యూకోబుతో చేరిపోతూండేవాడు. అతడు గ్రీకు క్రైస్తవులతో కలియడానికి జంకుతుండేవాడు, ఓమారు పేత్రు అంతియోకయకు రాగా పౌలు అతన్ని ఎదిరించి మాట్లాడాడు. నీనమ్మిక యేమిటో చెప్పమని నిలదీసి అడిగాడు. తర్వాత ఈతగాదా లన్నీ యెరూషలేము సమాజంలో పరిష్కారమయ్యాయి. అక్కడ పౌలు వాదమే నెగ్గింది - గల 2, 11-14 213