పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుద్ధితెచ్చుకొని మోషేకు మనవిచేసారు. అతడు ఇత్తడి పామును చేయించి గడెమీద వ్రేలాడదీయించాడు. దానివైపు చూచినవాళ్ళంతా విషం విరిగి బ్రతికిపోయారు - సంఖ్యా 21, 5-9.

4. మళ్ళా యిస్రాయేలీయులు ప్రయాణం చేస్తూ మారా అనే తావుకి వచ్చారు. అక్కడి నీళ్ళు కటిక ఉప్పలు. ఆ నీళ్ళు త్రాగలేక జనం మోషేమీద తిరగబడ్డారు. వెంటనే గొణగుడు ప్రారంభించారు. అపుడు మోషే ప్రభువు ఆనతిపై ఒక చెట్టు కొయ్యను ఆ నీళ్ళలో పడవేయగా అవి తియ్యని నీళ్ళయ్యాయి - నిర్గ 15, 25.

5. కోరా, దాతాను, అబీరాము మోషేమీద తిరుగబడ్డారు. దాని ఫలితంగా నేల నోరువిప్పి వాళ్ళను ్రమింగివేసింది.అదిచూచి యిప్రాయేలు సమాజం మోషేమీద గొణగారు. నీవు ప్రభు ప్రజను చంపివేసావుగదా అని దూషించారు. అపుడు ప్రభువు ప్రత్యక్షమై ఆ ప్రజలను నాశంచేయబోయాడు. కాని మోషే ప్రభుని వేడుకొని ఆయుపద్రవాన్నివారించాడు - సంఖ్యా 16, 41.

6. యెరూషలేములో తొలినాటి యూదక్రైస్తవులు ఉమ్మడి జీవితం జీవిస్తున్నారు, వాళ్ళలో పాలస్తీనా యూదులు కొందరు. అన్యదేశాల నుండి వచ్చిన యూదులు కొందరు. అన్నాలు వడ్డించేకాడ అన్యదేశాల నుండి వచ్చిన యూదుల విధవలకు అన్నం అట్టే సరిపోలేదు. కనుక వాళ్ళ వెంటనే పేత్రుమీద గొణగడం ప్రారంభించారు. ఆ గొడవ విని పేత్రు అన్నపానీయాలను పరామర్శించడానికై ఏద్దరు పరిచారకులను నియమించాడు - అచ 6, 1-6,

14. తగాదాలు

కొందరు ఆట ఆడినంత సులభంగా తగాదా ఆడుతూంటారు. కాని ఇది మూర్డుల లక్షణం. బుద్ధిమంతుడైనవాడు తొందరపడి తగాదాకు దిగడు. దిగినా మళ్లా సరుకొని పోతూంటాడు.

1 అబ్రాహాముభార్య సార గొడ్రాలుగావుంది, ఆమె ఆనాటి ఓ ఆచారం ప్రకారం, తన దాసీ ఐగుప్తు బానిసా ఐన హాగారును అబ్రాహామునకు భార్యగానిచ్చి ఆమెకు కలిగిన సంతానాన్ని తన సంతానం చేసికోవాలనుకొంది. కాని హాగారు అబ్రాహామువలన గర్భవతియైననాటినుండి కన్నూ మిన్నూగానక యజమానురాలైన సారాను చిన్నచూపు చూడ్డం మొదలెట్టింది. సారా ఇది సహింపక అబ్రాహాముకు ఫిర్యాదు చేసింది. ఆ బానిసతొత్తును నేలబెట్టి కాలరాచింది. అది యజమానురాలు పెట్టేబాధలు పడలేక యిల్లవిడిచి పారిపోయింది - ఆది 16, 1-6.