పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. కొరింతులో పౌలే క్రైస్తవసమాజాన్ని స్థాపించాడు. కాని కొరింతు క్రైస్తవుల్లో చీలికలేర్పడ్డాయి. మనలను రక్షించేది మోషే ధర్మశాస్త్రమేనని వాదించే యూదులు కొందరు కొరింతుకువచ్చి పౌలుమీద లేనిపోని అభాండాలు మోపారు. ఆ రోజుల్లో అపొల్లో అనే ఉపన్యాసకుడుగూడ తన బోధలతో ప్రజలను ఉర్రూతలూగించేవాడు. ఈలాంటి పరిస్థితుల్లో కొరింతు క్రైస్తవులు కొందరు మేము అపొల్లో పక్షమన్నారు. కొందరు పేత్రు పక్షమన్నారు. కొందరు పౌలుపక్షమన్నారు. ఇంకా కొందరు క్రీస్తు పక్షమన్నారు. ఈగందరగోళమంతా చూచి పౌలు చాల బాధపడ్డారు. ఒక్క క్రీస్తు ఇన్ని ముక్కలుగా విభజింపబడ్డాడా అని దుఃఖించాడు - 1కొరి 1, 11-13.

7. తొలినాటి క్రైస్తవులంతా యూదులే. వీళ్ళ యెరూషలేములో ఉమ్మడి జీవితం జీవిస్తూండేవాళ్లు, వీళ్ళల్లో మళ్ళా పాలస్తీనా యూదులనీ, అన్యదేశాల యూదులనీ రెండు తెగలుండేవి. ఈ రెండుతెగలకు పడేదికాదు. అన్యదేశయూదుల తెగవాళ్ళు పాలస్తీనా యూదుల తెగమీద ఫిర్యాదు చేసారు. మా విధవలకు అన్న పానీయాలు సరిగా అందడంలేదు. అంతా మీరే అనుభవిస్తున్నారు అని నేరంతెచ్చారు. పేత్రు సమాజపు భోజన సదుపాయాలు చూడ్డానికి ఏడ్గురు పరిచారకులను నియమించాడు. అపోస్తలులు మాత్రం ప్రార్థనలోను వాక్యబోధలోను కాలం గడిపారు - అకా 6, 1-6.

8.1) మూరలు కయ్యానికి కాలు దువ్వుతూంటారు. కాని తగాదాలు మానుకొనేవాళ్ళ ఘనులు - సామె 20, 3.
2) గయ్యాళిగంపతో ఇంట్లో కాపురముండే దానికంటె ఒంటరిగా యింటిమీద ఓమూల పడివుండడం మేలు - సామె 21, 9.

15. గర్వం

తొలిపాపంవలన భ్రష్కలమైపోయిన మనకందరికీ గర్వం సులభంగా పట్టుకవస్తుంది. కాని దేవునికి గర్వమంటే యెంతో రోత అది పిశాచగుణం.

1. ఫరోరాజు కఠినహృదయుడై యిస్రాయేలీయులను బాధిస్తున్నాడు. ప్రభువు పంపగావచ్చి మోషే యిప్రాయేలును పంపివేయవలసిందిగా యావే ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పాడు. ఆ మాటలకు ఫరో మండిపడి "ఎవడా యావే? అతని మాటలు విని నేనెందుకు ఈ బానిసలను వదలుకోవాలి?" అన్నాడు. ప్రభువు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని అద్భుత క్రియలు చేసినా ఫరో గుండె రాయి జేసికొన్నాడేగాని ప్రజలను పోనీలేదు. కనుక ప్రభువు ఫరోకు తగినశాస్తి చేసాడు. అతన్నీ అతని రథాలనూ నడిసముద్రంలో మంచివేసాడు.

2. హిజ్మియా గొప్పరాజు, అతడు ఒకమారు జబ్బుపడి వుండగా బాబిలోనురాజు సానుభూతి తెల్పుతూ తన దూతల నంపాడు. ఆ దూతలనుజూచి హిజ్కియా ఉబ్బిపోయి