పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. సోలోమోను రాజు మహాజ్ఞాని. కాని అతడు స్త్రీలోలుడై పోయాడు. అతడు చాలామంది అన్యజాతి స్త్రీలను పెండ్లియాడాడు. వాళ్ళంతా అతని హృదయాన్ని అన్యదేవతలవైపు త్రిప్పివేసారు. ఈ విధంగా అతడు అన్యజాతి స్త్రీలను వివాహ మాడకూడదన్నయావే యాజ్ఞ మీరి కడకు ఆ ప్రభుని ఆరాధించడం కూడ మానుకొన్నాడు1 రాజు 11, 2-3.

10. కోడి తన పిల్లలను రెక్కలకిందికి చేర్చుకొని కాపాడుతుంది. ఆలాగే క్రీస్తుకూడ యెరూషలేము పౌరులను కాపాడేవాడే కాని వాళ్ళు అతనిమాట వినలేదు - మత్త 23, 37-38.

13. గొణగుడు

మనం సహనం కోల్పోయి పై యధికారులమీద తప్పమోపుతాం. వాళ్ళమీద గొణగుతాం. ఈ గొణగుడు మన అసమ్మతిని తెలియజేస్తుంది. కనుక అది భగవంతునికి ప్రియపడదు. అతడు ఓకోమారు మన అవిధేయతను శిక్షిస్తుంటాడు గూడ.

1. యావే పంపించిన అరిష్టాలకు భయపడి ఫరో యిస్రాయేలును పంపివేసాడు. కాని వాళ్లు రెల్లసముద్రం వద్దకు పోగానే అతడు మనసుమార్చుకొని మళ్ళా వాళ్ళను పట్టుకొని రావాలని సైన్యంతో వచ్చాడు. సైన్యాన్ని చూచి యిస్రాయేలు ప్రజలు భయపడిపోయారు. మోషేమీద గొణిగారు. ఐగుప్తదేశంలో పూడ్చిపెట్టడానికి తావుదొరక్క మమ్ము ఇక్కడికి తీసికొని వచ్చావా అని అతన్ని నిందించారు. తరువాత ప్రభువు యిస్రాయేలును సముద్రం దాటించాడు. ఫరోచక్రవర్తినీ అతని సైన్యాన్నీ సముద్రంలో మంచివేసాడు - నిర్గ 14, 12.

2. యిప్రాయేలు ప్రజలు మోషేతో యెడారిలో ప్రయాణం చేస్తూ మెరిబా అనే తావుకి వచ్చారు. అక్కడ వాళ్ళకు త్రాగడానికి నీళ్ళ దొరకలేదు. వాళ్ళు వెంటనే మోషేమీద తిరగబడ్డారు. ఐగుప్తు లో వుండగా కడుపునిండా అన్నం దొరికింది. ఇక్కడ కూడూ నీళ్ళు కూడ కరువయ్యాయి అని గొణగారు. ప్రభువు ఆజ్ఞపై మోషే బెత్తంతో కొండబండను చరవగా నీటిపాయ పుట్టింది. జనం ఆ నీళ్ళు త్రాగి సంతృప్తి చెందారు - సంఖ్యా 20, 5-6.

3. యిప్రాయేలీయులు ఎడారిలో హోరు కొండ ప్రక్కగా నడుస్తున్నారు. వాళ్ళు మార్గాయాసంవల్ల సొమ్మసిల్లిపోయి మోషేమీద గొణగడం ప్రారంభించారు. "ఈయెడారిలో లభించే చవీసారమూ లేని అన్నం యెవరికి కావాలి? అసలు నీవు ఐగుప్తు నుండి మమ్మెందుకు తీసికొని వచ్చావు?" అని దబాయించారు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికై ప్రభువు నిప్పపాములను పట్టించాడు. అవి కరవగా చాలమంది చనిపోయారు. అపుడు ప్రజలు