పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓమారు మోషే సీనాయి కొండ మీదికిపోయి నలువది నాళ్ళదాకా అక్కడే వండిపోయాడు. అతడు కొంచెం ఆలస్యం చేసిందే తడవుగా, యిప్రాయేలీయులు అహరోను నాయకత్వం క్రింద బంగారు కోడెదూడను చేసికొని దాన్ని ఆరాధించడం మొదలెట్టారు - నిర్గ 32, 7-8.

4. బిలాము ప్రభువు వద్దన్నా వినక యిస్రాయేలు శత్రువూ మోవాబు రాజూ ఐన బాలాకును దీవించడానికి గాడిద నెక్కి పయనం కట్టాడు. యిప్రాయేలును శపించడానికే బాలాకు బిలామను పిలిపించాడు. త్రోవలో ప్రభువదూత బిలాము గాడిదకు అడ్డుపడి దాన్ని ఆపాడు. బిలాము మూడుసార్లు గాడిదను చావమోదాడు. అప్పుడు గాడిద దైవశక్తితో మాటలాడింది. తన్నుకొట్టవద్దని మొరపెట్టుకుంది. దేవదూతగూడ బిలాముకు ప్రత్యక్షమై అవిధేయతకుగాను అతన్ని మందలించాడు. - సంఖ్యా 22, 31-35.

5. మోషే అహరోనులు ఫరోవద్దకువచ్చి యిస్రాయేలు ప్రజను ఐగుపునుండి పంపవలసిందిగా యావే ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పారు. ఫరో అహంభావంతో "ఎవడా యావే? అతడు చెప్పిన మాటలు విని నేనెందుకు యిస్రాయేలీయులను పంపాలి?" అన్నాడు. ప్రభువు ఫరోను సర్వనాశంచేసి తన ప్రజను ఐగుప్మనుండి తోడ్కొని పోయాడు - నిర్గ5, 2.

6. యిప్రాయేలు ప్రజలను శత్రువులు బాధింపగా వాళ్లు ప్రభువుకి మొరపెట్టేవాళ్లు. ప్రభువు వాళ్ళమీద కరుణబూని ఓ న్యాయాధిపతిని నియమించేవాడు. ఈ న్యాయాధిపతి శత్రువుల నుండి యిప్రాయేలును రక్షించేవాడు. కాని అతడు చనిపోగానే వాళ్ళమూరులై అన్యదైవతాలను ఆరాధించేవాళ్ళు అపుడు ప్రభువు వాళ్ళను శిక్షించడానికై శత్రువుల పాలుచేసేవాడు. వాళ్ళ శత్రువుల బాధ భరించలేక మళ్లా ప్రభువుకు మొరపెట్టుకొనేవాళ్ళ నరుల బలహీనత ఈలా వుంటుంది - న్యాయాధి 2, 18-19.

7. సౌలు గిల్లాలువద్ద సమూవేలు కొరకు వేచివున్నాడు. సమూవేలు ప్రవక్త నేను వారందినాల్లో వస్తాను. నేను వచ్చిందాకా బలి సమర్పించవద్దన్నాడు. కాని ప్రవక్త తాను పెట్టిన గడువులో రాలేదు. శత్రువులైన ఫిలిస్టీయులువచ్చి మీద పడేలాగూ వున్నారు. సౌలు ఆతురత పట్టలేక తానే బలి సమర్పించాడు. ఆ బలి ముగియడంతోనే సమూవేలు వచ్చి మాట మీరినందుకు సౌలును మందలించాడు. నీవు దేవుని ఆజ్ఞ మీరావు గనుక దేవుడు నిన్ను రాచరికంనుండి త్రోసివేసాడని చెప్పాడు - 1సమూ 13, 13-14.

8. అహాబు సిరియారాజైన బెన్షద్రదును జయించాడు. ప్రభువు ఈ బెన్హ దదును శాపంపాలుచేసి సంహరించమని చెప్పాడు. కాని బెన్షదదు కపటంతో అహాబును శరణువేడగానే అహాబు గుండె కరిగి అతన్ని ప్రాణాలతో వదలివేసాడు. అపుడు ప్రభువు అహాబునొద్దకు ఓ ప్రవక్తను పంపి బెన్షదదు ప్రాణాలకు మారుగా నీ ప్రాణాలు పోతాయని చెప్పించాడు 1 రాజు 20, 42-43.