పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరుసభ పవిత్రత మనం కంటితో చూచేదికాదు. విశ్వాసంతో నమ్మేది, తిరుసభలో ఓవైపు పాపాత్ములూ మరోవైపు పరమ పవిత్రులూ కూడ వున్నారు. పునీతులు వేదసాక్షులు కన్యలు స్తుతీయులు మఠస్థాపకులు మొదలైనవాళ్ళంతా తిరుసభ పావిత్ర్యాన్ని చాటిచెప్పేవాళూ


తిరుసభ అంతా కలసి పవిత్రమైంది. తిరుసభ సభ్యులమైన మనంకూడ వ్యక్తిగతంగా పవిత్రులం కావడానికి నిరంతరం కృషి చేయాలి. మనం పుణ్యకార్యాలు చేసినపుడల్లా ఆత్మ తన వరప్రసాదబలంతో మనలను పునీతులను చేస్తుంది. మన సత్కార్యాలద్వారా తిరుసభ పవిత్రత లోకంలో చీకటిలో దీపంలా ప్రకాశిస్తుంది. మదర్ తెరీసా ఈలాంటి మాన్యురాలు.

2. తిరుసభ పవిత్రమైందని చెప్పాం. ఐనా అది పాపాత్ములతో కూడిన తిరుసభ కనుక అది పాపాపూరితమైంది కూడ. మనం ఓవైపు పవిత్రంగా వుండాలని ప్రయత్నం చేసినా మరోవైపు పాపకార్యాలు చేస్తూనే వుంటాం. ఈలాగే తిరుసభ అంతాకూడ పాపకార్యాలు చేస్తూనే వుంటుంది. ఆ సభ నాయకుల్లో అధికార దాహమూ, సుఖభోగాలూ, ధనవాంఛా, లౌకిక విలువలూ, ఆత్మప్రబోధాన్ని పెడచెవిని పెట్టడం, క్రీస్తు బోధలను విస్మరించడం అనే నానాపాపాలు వున్నాయి. ఆత్మ ప్రేరణంతోపాటు పిశాచ ప్రేరణం కూడ తిరుసభలో ఎప్పడూ కన్పిస్తూనే వుంటుంది.

నూతవేదం తిరుసభ కళంకమైంది అని చెప్తుంది. వలలో చక్కిన చేపల్లో మంచివీ పాడువీకూడ వున్నాయి - మత్త 13,47-50. క్రైస్తవుల్లో ఎవరైనా మాకు పాపంలేదు అని చెస్తే వాళ్లు తమ్ముతామే మోసగించుకొన్నట్లవుతుంది - 1యోహా 1,8. మనమంతా చాలసార్లు పొరపాట్ల చేస్తాం - యాకో 3,2. ఈలాంటి వేదవాక్యాలన్నీ తిరుసభ పాపాన్ని నిరూపిస్తాయి. పాపాత్ములు ఆ సభలో ఎప్పడూ వుంటారు. వారి పాపాలు క్రీస్తు శరీరాన్ని కళంకితం చేస్తాయి. దాన్ని గాయపరుస్తాయి. అది కూలి పడిపోయేలా చేస్తాయి. దాన్ని రోగగ్రస్తం చేస్తాయి. ఈ మచ్చ దానికి దేవునినుండిరాదు. తన సభ్యులనుండే వస్తుంది.

తిరుసభ దోషి కనుక తన పాపాలకు తాను పశ్చాత్తాపపడాలి. తన తప్పిదాల కొరకు తపస్సుచేసి ప్రాయశ్చిత్తం చేసికొని దోషవిముక్తిని పొందాలి. ఆత్మనుండి నూత్నత్వాన్ని సంపాదించుకోవాలి.

తిరుసభ ఒకవైపు పాపాత్మురాలు, మరోవైపు పవిత్రురాలు. అందుకే విశ్వాససంగ్రహంలో "పవిత్ర తిరుసభను విశ్వసిస్తున్నాను" అంటాం. ఈ లోకంలో యాత్ర చేస్తూన్నంత కాలం అది ఓవైపు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటూనే వుండాలి.

మరోవైపు పావిత్ర్యంలో అభివృద్ధి చెందుతూనే వుండాలి. మోక్షాన్ని చేరుకొని మహిమను పొందినపడేగాని తిరుసభ పాపాన్ని పూర్తిగా విడనాడి సంపూర్ణమైన పావిత్ర్యాన్ని పొందలేదు.