పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ వాటికన్ సభ అన్యమతాల్లో కూడ పవిత్రత, న్యాయం, సత్యం, మంచితనం అనే విలువలున్నాయని రూఢిగా ప్రకటించింది. దేవుడు అందరి రక్షణాన్నీ కోరేవాడు కనుక అతని ఆత్మ ఒక్క తిరుసభలోనే కాక దానికి వెలుపల కూడ పనిజేస్తూ వచ్చింది.

క్రైస్తవేతరులకు కూడ రక్షణం వుంటుందని ఈ సభ స్పష్టంగా బోధించింది. ఈ బోధలో నాల్గంశాలున్నాయి. 1. నరులు పాపాంలో పడిపోయాక గూడ దేవుడు వారిని చేయి విడువడు. వారి రక్షణకు అవసరమైన వరప్రసాదాన్ని వారికి ఇస్తూనే వుంటాడు. 2. ఆ ప్రభువు మనకు తెలియని పద్ధతిలో క్రీస్తు మరణోత్తానాల ప్రతిఫలమైన రక్షణం అన్యమతథస్థుల విూదకూడ సోకేలా చేస్తాడు. క్రీస్తు అందరు సరుల కొరకు చనిపోయాడుకదా! కనుక మనకు తెలియని రీతిలో అతని మరణోత్తానాలు అందరిమిూద సోకుతాయి. 3. దేవుని రక్షణం దేవద్రవ్యానుమానాలకూ తిరుసభకూ మాత్రమే కట్టుపడి వుండదు. వీటి ప్రమేయం లేకుండా గూడ అది పనిచేయవచ్చు. క్రీస్తు రాకముందే, అతడు ఉత్తానం కాకముందే, పవిత్రాత్మలోకంలోని నరులమిూద తన ప్రభావాన్నిచూపుతూ వచ్చింది. 4 తమ అంతరాత్మ ప్రకారమూ దేవుని చిత్త ప్రకారమూ జీవించేవాళ్లు ఎవరైనా ఎక్కడైనా రక్షణాన్ని పొందుతారు. అంతరాత్మ నరుని హృదయంలోని పవిత్రదేవాలయం. దానిలో నరులకు దేవుని స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఆదేశం ప్రకారం జీవించేవాళ్లకు తప్పక రక్షణం లభిస్తుంది.

ఈ సూత్రాల ప్రకారం అన్యమతాల్లో కూడ సత్యమూ వరప్రసాదమూ వుంటాయి. కనుక అన్యమతాల నుండి కూడ రక్షణం లభిస్తుంది. అనగా తిరుసభకు వెలుపలకూడ రక్షణం వుంది. మరి అప్పడు తిరుసభ ఏకైక రక్షణ సాధనం అనడంలో భావం ఏమిటి?

రెండవ శతాబ్దంలో జీవించిన ఓరిజిన్ అనే వేదశాస్త్రి తిరుసభకు వెలుపల రక్షణం లేదు" అని చెప్పాడు. ఐదవ శతాబ్దంలో సిప్రియన్ భక్తుడు ఈ సూత్రాన్ని బాగా ప్రచారం చేసాడు. అతని దృష్టిలో తిరుసభ నోవా వోడలాంటిది. ఆ వోడను ఎక్కని వాల్లెవరూ రక్షణం పొందరు. శతాబ్దాల పొడుగునా తిరుసభకూడ ఈ సూత్రాన్ని తన బోధల్లో అధికార పూర్వకంగా పునరుద్దాటిస్తూ వచ్చింది.

ఇంతవరకు మనం చూచినదాన్నిబట్టి తిరుసభకు వెలుపలకూడ రక్షణం వుంటుందని ఒక సూత్రం చెప్తుంది. తిరుసభకు వెలుపల రక్షణం లేదని ఇంకో సూత్రం చెప్తుంది. ఈ రెండు సూత్రాలను సమన్వయపరచడం ఏలా?

ఇక్కడ రెండంశాలను గమనించాలి. 1. తిరుసభకు వెలుపల రక్షణం లేదు అంటే భావం ఇది క్రీస్తే "మిరు వెళ్లి అందరిని నా శిష్యులను చేయండి. వారికి నా