పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు మొదటి రక్షణ సాధనం కావడం వల్లనే అతని నుండి దేవద్రవ్యానుమానాలు తిరుసభ మొదలైన ఇతర రక్షణ సాధనాలు పట్టాయి. నేడు మనం వీటిల్లో క్రీస్తుని కలసికొని అతడు అందించే రక్షణాన్ని పొందుతున్నాం.

2. తిరుసభ ఎల్లరికీ రక్షణ సాధనం

తిరుసభ ఎల్లరికీ రక్షణ సాధనం ఎందుకౌతుందంటే, దానిలో మనం ఉత్తాన క్రీస్తునీ అతని ఆత్మనూ కలసికొని రక్షణాన్ని స్వీకరిస్తాం. దానిలో క్రీస్తు సాన్నిధ్యం సంపూర్ణంగా వుంటుంది. ఆ సాన్నిధ్యం మనవిూద సోకి మనకు వరప్రసాదాన్ని దయచేస్తుంది. మనలను దైవ రాజ్యానికి సిద్ధం చేస్తుంది.

తిరుసభ నానా రక్షణ సాధనాల్లో ఒకటి మాత్రమే కాదు. ఏకైక రక్షణ సాధనం. ఎందుకంటే ఏకైక మధ్యవర్తియైన క్రీస్తు దానిద్వారా మాత్రమే రక్షణ కార్యాన్ని నిర్వహిస్తాడు - 1తిమొు 2,5. ఎల్లరూ దానినుండి వరప్రసాదాన్ని పొందవలసిందే. ఇతర మతాల్లో కూడ క్రీస్తునుండీ, అతని తిరుసభనుండీ వచ్చే వరప్రసాదమే రక్షణాన్నిస్తుంది.

తిరుసభ తాను క్రీస్తునుండి పొందిన రక్షణాన్నే ఇతరులకు అందిస్తుంది. కనుక అది పవిత్రంగా జీవిస్తూ క్రీస్తు వరప్రసాదాన్ని పరిపూర్ణంగా పొందుతుండాలి. అందుచే అది నిరంతరమూ తన పాపాలకు తాను పశ్చాత్తాప పడుతుండాలి. తన కల్మషాలను తాను అధికాధికంగా కడిగివేసుకొంటుండాలి. అప్పడేగాని క్రీస్తు ఆత్మ దానిలో బలంగా పనిచేయదు.

నరులంతా తన సొంత ప్రజలూ, పవిత్రాత్మ వసించే దేవాలయమూ, క్రీస్తు దేహమూ, కావాలనే తండ్రి కోరిక. క్రీస్తు నరులందరికీ శిరస్సు. నరులు అతని దేహం. ఆ శిరస్పూ దేహమూ రెండూ కలసి తన్ను ఆరాధించాలనే తండ్రి చిత్తం. తిరుసభ ఈ దైవచిత్తాన్ని నెరవేర్చడానికి వుంది. అందుకే అది అందరికీ రక్షణ సాధనమౌతుంది. ఎల్లరూ దాని ద్వారానే దైవరాజ్యంలో చేరాలి.

తిరుసభ ఈలోకంలో చిన్నమందే. ఐనా ఐక్యత ప్రేమ విశ్వాసాలనే పుణ్యాల ద్వారా అది నరజాతి కంతటికీ రక్షణ సాధనమౌతుంది. అది లోకానికి వెలుగూ, ఉప్పగా వుంటుంది - మత్త 5,13-14.

3. అన్యమతాల స్థానం

కాని తిరుసభ ఏకైక రక్షణ సాధనమైతే, అన్యమతాల స్థానం ఏమిటి? అవి నరులకు రక్షణ సాధనాలు కావా?