పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేరిట జ్ఞానస్నానం ఈయండి" అని ఆదేశించాడు - మత్త 28,19. దీన్నిబట్టి అందరూ తిరుసభలో చేరాలని విశదమౌతుంది. కనుక ఎవరైనా సరే తిరుసభను దేవుడే ఏర్పాటు చేసాడని తెలసికూడ దానిలో చేరకపోతే వారికి రక్షణంలేదు. కాని తెలియక తిరుసభలో చేరకపోతే వారికి రక్షణం వుండవచ్చు. 2. రక్షణం పొందాలంటే నరులు వస్తుతః తిరుసభలో చేరి వండనక్కరలేదు. హృదయంలోని కోరికద్వారా దానికి చెందివుంటే చాలు. ఈ కోరిక స్పష్టంగా వుండనక్కరలేదు. అస్పష్టంగా వున్నాచాలు. అనగా నరునికి తాను దైవచిత్తప్రకారం జీవించాలనే కోరిక వుంటే చాలు రక్షణం లభిస్తుంది. అందరికీ తిరుసభలో చేరే అవకాశం లేకపోవచ్చుకదా!

ఫలితార్థమేమిటంటే, తిరుసభ ఏకైక రక్షణ సాధనమని తెలిసికొన్నవాళ్లకి అది వొక్కటే రక్షణ సాధనం. వాళ్లకు అన్యమతాల ద్వారా రక్షణం లభించదు. కాని అలా తెలియనివాళ్ళకు అన్యమతాల ద్వారా గూడ రక్షణం లభిస్తుంది. ఐనా ఈ రక్షణం క్రీస్తునుండీ తిరుసభనుండీ వచ్చిందే.

ఇక్కడ "తెలిసికొన్నవాళ్ళకు" అంటే కేవలం బుద్ధిశక్తితో తెలిసికోవడం మాత్రమే కాదు. నరునికి తిరుసభను గూర్చి క్షుణ్ణంగా తెలిసికొనే అవకాశమూ వండాలి. దానిలో చేరే అవకాశమూ వుండాలి. మనదేశం, మన పూర్వుల మతం అనే దురభిమానాలు అడ్డురాకుండా వుండాలి. బంధుమిత్రులు మతం మార్పిడిని అంగీకరించాలి. ఈలాంటి అవకాశాలన్నీ వున్నవారికి తిరుసభ ఒక్కటే రక్షణ సాధనం ఔతుంది. ఇవిలేనివారికి ఇతర మతాలు కూడ రక్షణ సాధనాలు కావచ్చు. ఈలా అన్యమతాల ద్వారా రక్షణను పొందే సజ్జనులను నేటి వేదశాస్తులు "క్రైస్తవులనే పేరులేని క్రైస్తవులు" అని పేర్కొంటున్నారు, అనగా వీళ్లు వస్తుతః క్రైస్తవులు కాకపోయినా నిజజీవితంలో క్రైస్తవులుగా జీవించేవాళ్లు.

ఇప్పడు మనం "తిరుసభకు వెలుపల రక్షణం లేదు" అంటే ఈ తిరుసభను క్యాతలిక్ తిరుసభనుగా మాత్రమే అర్థం చేసికోగూడదు. క్రీస్తు మరణోత్థానాలు సోకినవారి బృందంగా అర్థం చేసికోవాలి. అప్పడు "తిరుసభ వెలుపల రక్షణం లేదు" అన్నా"తిరుసభ ఎల్లరికి రక్షణ సాధనం" అన్నా భావం ఒకటే ఔతుంది. క్రీస్తు మరణోత్తానాలు నరులందరిమిదా సోకుతాయి. కనుక ఈ విశాలార్థంలో అందరికీ రక్షణం లభించవచ్చు. అప్పడు క్రీస్తు మరణోత్తానాల ఫలితమైన రక్షణాన్ని బుద్ధిపూర్వకంగా నిరాకరించిన వాళ్లు మాత్రమే రక్షణను కోల్పోతారు.

తిరుసభ తన బోధద్వారా, సేవద్వారా, పవిత్రతద్వారా అందరికీ తన్నుతాను ఎరుకపరచుకోవాలి. అప్పడు అందరూ దానిలో చేరి పరిపూర్ణంగా రక్షణను పొందే అవకాశం లభిస్తుంది.