పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవది, వాళ్లు క్రీస్తు సువార్తను గూర్చీ దైవరాజ్యాన్ని గూర్చీ ప్రజలకు బోధిస్తారు. క్రీస్తుతోనే దైవరాజ్యం వచ్చింది కనుక పిశాచాలను వెళ్ళగొట్టి వాటి రాజ్యాన్ని కూలద్రోస్తారు. ఒకవిధంగా వాళ్లు క్రీస్తు పనిని కొనసాగిస్తారు. అతడు పోయాక అతని స్థానాన్ని పొందుతారు.

నూత్నవేదంలో ప్రేషితులపేర్లు విన్పించే జాబితాలన్నిటిలోను పేత్రు పేరు మొదట, యూదా పేరు కడపట వస్తాయి.

3. పూర్వవేదంలో "షాలువా" అనే హీబ్రూపదం ఒకటుంది. (బహువచనం, షెలుహిం). ఈ పదానికి "ప్రతినిధి" అని అర్థం. రాజకీయ కార్యాల్లో వ్యాపారాల్లో మతబోధల్లో పై యధికారులు తమ ప్రతినిధులను క్రిందివారి దగ్గరకి పంపేవాళ్ళు వీళ్ళ తమ్మ పంపిన అధికారుల ఉద్దేశాలను ఆ ప్రజలకు తెలియజేసేవాళ్లు, తమ్ము పంపినవారి అధికారమంతా ఈ ప్రతినిధులకుకూడ వుండేది. ఈ దృష్టిలో పూర్వవేదంలోని ప్రవక్తలు దేవుని ప్రతినిధులు - షెలుహిం. క్రీస్తు ఈ పూర్వవేద ప్రతినిధులను మనసులో పెట్టుకొనే తన పండ్రెండుమంది శిష్యులను ప్రేషితులనుగా నియమించాడు. (తెలుగులో ప్రేషితుడు అంటే పంపబడినవాడు అని అర్థం. అపోస్తలుడు అనే గ్రీకు మాటకు సరైన తెలుగు పదం ఇది.) కనుకనే అతడు తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్ము పంపుతున్నాను అని వాకొన్నాడు - యోహా 20,21. అనగా వాళ్ళు తన దైవరాజ్య బోధను కొనసాగించేవాళ్ళని భావం.

ఈ పండ్రెండుమంది క్రీస్తు ఉత్థానానంతరం దైవరాజ్యబోధకులుగా పనిచేయడం మొదలెట్టారు. ఉత్తానక్రీస్తు విూరు వెళ్ళి సకల జాతిజనులకు నా శిష్యులనుగా చేయండి అని చెప్పాడు-మత్త 28,19-20. తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మ పంపుతున్నాను అన్నాడు - యోహా 20,21. వాళ్లు అతని ప్రతినిధులుగా, అతనికి సాక్షులుగా పితనుగూర్చి బోధిస్తారు.

4.ప్రేషితులకు ఉండవలసిన అర్హతలు మూడు. మొదటిది, వాళ్ళ ఉత్థానక్రీస్తును చూచినవాళ్ళయి వుండాలి-1కొ9,1. రెండవది, క్రీస్తే వాళ్ళను బోధచేయమని ఆజ్ఞాపించి వుండాలి-లూకా 24,47-48. ఉత్తానానికి పూర్వంకూడ క్రీస్తు కొందరిని వేదబోధకు పంపాడు, కాని అది ప్రేషిత లక్షణంకాదు- మత్త 10,5. మూడవది, ఇహలోకంలో వాళ్లు క్రీస్తుతో తిరిగిన వాళ్ళయివుండాలి- అ,చ,121. అనగా వాళ్లు చారిత్రక క్రీస్తునీ ఉత్థానక్రీస్తునీ ఎరిగినవాళ్లయి అతడు సాధించిన రక్షణ సంఘటనను అర్థం జేసికొన్న వాళ్లయి వుండాలి.