పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు తన జీవిత కాలమంతా తిరుసభను ఏర్పాటుచేయాలనే ప్రయత్నంలోనే వున్నాడు, విశేషంగా అతడు పన్నెండుమంది శిష్యులను నియమించడం, పేత్రుకి ఆధిపత్యం దయచేయడం, సత్రసాదాన్ని స్థాపించడం అనే మూడు క్రియలు అతడు తిరుసభ పుట్టుకను ఆశించాడని రుజువు చేస్తాయి. కనుక ఈ మూడంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

2. పన్నెండుమంది శిష్యుల నియామకం

"క్రీస్తు పర్వతమెక్కి తాను కోరుకొన్న వారిని పిలవగా వాళ్ళు అతని దగ్గరికి వచ్చారు. అతడు పన్నెండుమందిని ఎన్నుకొని వారికి ప్రేషితులు అని పేరు పెట్టాడు. తనతో వుండడానికి, సువార్తను బోధించడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి క్రీస్తు వారిని నియమించాడు” - మార్కు 3,13-15.

ఈ వేదవాక్యాల్లో చాల భావాలున్నాయి. వాటిని విపులంగా పరిశీలిద్దాం.

1. క్రీస్తు కొండమిూదికి వెళ్ళి అక్కడ రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆ పిమ్మట శిష్యులను ఎన్నుకొన్నాడు - లూకా 6,12-13. వారి యెన్నిక అతడు చేపట్టిన ముఖ్యమైన కార్యాల్లో వొకటి. పూర్వం మోషే కొండమిదనే దేవుని నుండి ధర్మశాస్తాన్ని స్వీకరించాడు. క్రీస్తు కొండమిూదనే మారురూపం పొందాడు. కనుక బైబుల్లో కొండ దైవసాన్నిధ్యానికి గుర్తు. ఇక, క్రీస్తు రాత్రంతా ప్రార్థన చేయడం దైవచిత్తాన్నితెలిసికోవడానికి. ఇక్కడ క్రీస్తు శిష్యులు క్రీస్తుని ఎన్నుకోలేదు. క్రీస్తే శిష్యులను ఎన్నుకొన్నాడు - యోహా 15,16.

ఈ యెన్నిక క్రీస్తు గలిలయ బోధకు, అక్కడ ప్రజలు తన్ను తిరస్కరించడానికీ ముందే జరిగింది.

ప్రభువు ఎన్నుకొనిన పండ్రెండుమంది శిష్యులూ పండ్రెండు తెగల యిస్రాయేలీయులను సూచిస్తారు. వాళ్లు ప్రాత యిస్రాయేలీయుందరికి సంగ్రహరూపం. నూత్న యిప్రాయేలీయులకు నాంది. వీళ్ళ ద్వారానే తిరుసభ ప్రారంభమౌతుంది.

క్రీస్తుకి చాలమంది శిష్యులుండేవాళ్లు. అతడు వాళ్ళల్లో పండ్రెండు మందిని మాత్రమే ఎన్నుకొన్నాడు లేక 'నియమించాడు". పూర్వవేదంలో యాజకులను ఎన్నుకొన్నపుడు కూడ ఈ నియమించడం అన్న పదాన్నే వాడేవాళ్ళు, కనుక నూత్నవేద ప్రేషితులు పూర్వవేద యాజకుల్లాంటివాళ్లు అని భావం.

2. ఈ పండైండు మందిని పిల్వడంలో క్రీస్తు ఉద్దేశాలు రెండు. మొదటిది, వాళ్లు తనతో వండాలి. ప్రేషితులు క్రీస్తుతోవుండి అతని జీవిత విధానాన్ని నేర్చుకొంటారు. అతనితో ప్రయాణాలు చేస్తారు. అతని బోధలు వింటారు. అద్భుతాలు చూస్తారు. ఇతర శిష్యులు క్రీస్తుని విడనాడి వెళ్ళిపోయినా వీళ్ళమాత్రం అలా వెళ్ళిపోరు. కనుక వీళ్లు క్రీస్తుకి ముఖ్యమైనవాళ్ళు