పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. అగస్టీను భావాల ప్రకారం, అన్ని భోజనాలు మనలోనికి మారతాయి. కాని దివ్యభోజనం మనలోనికి మారదు కదా, మనలను తనలోనికి మార్చుకొంటుంది. అనగా దీనిద్వారా మనం క్రీస్తులోనికి మారతాం, అతనితో ఐక్యమౌతాం. ఇది మనలను దివ్యలను చేస్తుంది.

6. మనం దైవస్వభావంలో పాలు పొందుతామని చెప్తుంది రెండవ పేత్రు జాబు 1,4. ఈ క్రియ ప్రధానంగా జ్ఞానస్నానం ద్వారా జరుగుతుంది. కాని దివ్యసత్రసాదం ద్వారా కూడ మనం దైవస్వభావంలో పాలు పొందుతాం. దానిద్వారా అతడు మనలోను మనం ప్రభువులోను వసిస్తాం - యోహా 6,56, దేవుని స్వభావం పొంది దేవునితో ఐక్యం అవడమంటే యిదే, ఇది సామాన్య భాగ్యమేమీ కాదు.

10. దివ్యసత్ర్పసాదం మనలను తోడి నరులతో ఐక్యపరుస్తుంది

"రొట్టె ఒక్కటే. ఆ వొకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనా ఒకే శరీరమాతాం? - 1కొ 10,17. దివ్యసత్రసాదం మనలను ఉత్తాన క్రీస్తుతో ఐక్యం చేసినట్లే తోడి ప్రజలతో గూడ ఐక్యం జేస్తుంది. ఈ చివరి అధ్యాయంలో ఆ దివ్యభోజనం కలిగించే సామాజిక స్ఫురణను ඝට්ඨිච්ටඩ් చూద్దాం. ఇక్కడ ఐదంశాలు విలోకిద్దాం.

1. సంఘిభావం

నూతవేదం చాలాతావుల్లో దివ్యభోజనం సంఘిభావం కలిగిస్తుందని చెప్తుంది. ఇక్కడ మూడంశాలు మాత్రం పరిశీలిద్దాం.

1. యోహాను 15-17 అధ్యాయాలు యాజకుడుగా క్రీస్తు చేసిన ప్రార్ధనం. అతని సువార్తలో ఈ యధ్యాయాలు దివ్యసత్రసాద స్థాపనకు సంబంధించినవి. ఈ యధ్యాయాల్లో క్రీస్తు తన శిష్యులకు ఐక్యతాభావం సిద్ధించాలని తండ్రిని ప్రార్థించాడు. ప్రస్తుతం మనం ఈ భాగం నుండి రెండు ఘట్టాలను మాత్రం పరిశీలిద్దాం.

1) 15,12-14. నేను మిమ్మ ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించాలి అన్నాడు ప్రభువు. మన పరస్పర ప్రేమకు క్రీస్తు మనపట్ల చూపిన ప్రేమే ఆదర్శం కావాలి. కాని అతడు మనపట్ల చూపిన ప్రేమ ఏలాంటిది? మనలను అంతందాకా, అనగా గాఢంగా