పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేమించేది - 13,1. మనకోసం ప్రాణాలు కూడ వొద్దేది - 5, 13 తోడిజనం పట్ల మన ప్రేమ కూడ ఈలాంటిదై యుండాలి. ఈలాంటి సోదరప్రేమ మనకు దివ్యసత్రసాదం ద్వారా సిద్ధిస్తుంది.

2) 17,20-23. తండ్రీ కుమారులు ఏకమైయున్నట్లే శిష్యులు కూడ పరస్పరం ఏకమై యుండాలి. లోకంలో ఈలాంటి ఐక్యభావముండదు కనుక శిష్యుల ఐక్యభావం లోకానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ శిష్యులను చూచి వాళ్ల గురువైన క్రీస్తు దేవుడని లోకం విశ్వసించింది. ఇక శిష్యులకు ఈ ఐక్యభావాన్ని ప్రసాదించేది ఉత్తానక్రీస్తు, అతని దివ్యదేహం.

2. 1కొ 10, 17. పూర్వం పూజలో ఒక్కటే పెద్ద రొట్టెను ఆశీర్వదించి అందరికీ సత్రసాదంగా పంచిపెట్టేవాళ్ళు ఆ రొట్టె క్రీస్తు శరీరం. ఆ వొకే రొట్టెలో పాలుపొందే వాళ్లంతా ఒక్క శరీరం - అనగా ఒక్క శ్రీసభ, ఒక్క క్రైస్తవ సమాజం ఔతారు. ఈలా సత్ర్పసాదం మనకు ఐక్యతను ప్రసాదిస్తుంది. జ్ఞానస్నానంతోనే ఈ యైక్యత ప్రారంభమౌతుంది. అతనిలోకి జ్ఞానస్నానం పొందినవాళ్ళల్లో జాతి విభేదం లేదు. స్త్రీ పురుష భేదం లేదు. ధనిక దరిద్ర భేదం లేదు. అందరూ ఒక్కటే - గల 3.28. ఈలా జ్ఞానస్నానంతోనే ప్రారంభమైన ఐక్యభావం సత్ర్పసాదంతో పరిపూర్ణత నొందుతుంది.

3. అ.చ.2,42-47. తొలినాటి యెరూషలేములోని క్రైస్తవులు ప్రేమభావంతో ఉమ్మడి జీవితం జీవించారు. 42వ వచనం ప్రకారం వీళ్లు నాలుగు కార్యాలు చేసారు. 1) అపోస్తలులు ఉత్థాన క్రీస్తుని గూర్చి బోధిస్తుంటే శ్రద్ధగా విని అతన్ని విశ్వసించారు. 2) అందరు కలసి ఉమ్మడి జీవితం జీవించారు. 3) అందరూ కలసి ప్రేమవిందులో పాల్గొన్నారు. ఈ విందులో మామూలు భోజనమూ దివ్యసత్ర్పసాదమూ రెండూ భుజించేవాళ్ళు, 4) అపోస్తలుల ఆధిపత్యం క్రింద ప్రార్ధనం జేసికొన్నారు. ఈ నాలు కార్యాల్లోను దివ్యసత్ర్పసాద స్వీకరణం ముఖ్యమైంది. వాళ్ళు ఉత్తాన క్రీస్తు పేరుమీదిగానే ఆలా కలసిమెలసి ఉమ్మడి జీవితం జీవించారు. ఆ ఉత్తాన క్రీస్తునే దివ్యభోజనంగా గూడ పుచ్చుకొన్నారు. ఈ భోజనం శక్తి వల్లనే ఏక మనస్కులు కాగలిగారు, ఒకరి ఆస్తిని ఒకరికి పంచి యీయగలిగారు, సత్ర్పసాదం సాధించిపెట్టే ప్రేమ జీవితానికి ఈ ఘట్టం చక్కని తార్మాణం.

2. ఆత్మ దివ్యసత్ర్పసాదాల ద్వారా ఐక్యత

దివ్యసత్రసాదమూ ఆత్మా రెండూ గూడ క్రైస్తవ ప్రజలను ఐక్యపరుస్తాయి. ఆత్మద్వారానే గదా క్రీస్తు ఉత్తానమైంది? - రోమా 8,11. కనుక ఉత్థాన క్రీస్తు దేహమైన