పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1కొ 10. 1కొ 11. సువిశేషాల్లో దివ్య సత్రసాదాన్ని గూర్చిన వాక్యాలు.) ఇంకా శ్రీసభ తొలిరోజుల్లో పూజలో పాల్గొనే వాళ్ళంతా దివ్యసత్ర్పసాదాన్ని పుచ్చుకొనేవాళ్ళు ఈ కారణాల వల్ల నేడు భక్తులు కేవలం పూజలో పాల్గొంటేనే చాలదు, దివ్యసత్ర్పసాదాన్ని గూడ స్వీకరించాలి. ఆ భోజనాన్ని స్వీకరించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆధ్యాత్మిక విధంగానైన దాన్ని స్వీకరించాలి.

2.నూత్నవేదం ఉత్తాన క్రీస్తుని వర్ణించేపుడు అతడు తేజస్సు కలవాడని చెప్పంది - 2కొ 4, 18. అతడు ఆత్మ కలవాడని చెప్మంది - 1కొ 15,45. అతడు శక్తి కలవాడని చెప్తుంది - రోమ 14. కనుక తేజస్సు, ఆత్మ శక్తి ఉత్తాన క్రీస్తులో కన్పిస్తాయి. ఈ మూడు భావాలు ఒకటే. ఆత్మ తన సాన్నిధ్యంతో, శక్తితో, తేజస్సుతో ఉత్తానక్రీస్తు దేహంలో నెలకొంటుంది. ఇక, ఈ మూడు గుణాలు దివ్య సత్రసాదానికి గూడ వుంటాయి. అది ఉత్తాన క్రీస్తు దేహమే.

3.ప్రభువు మన భౌతిక వస్తువులైన రొట్టెరసాలనే తన శరీరరక్తాలను చేసికొంటాడు. వాటిని తయారుచేయడానికి మనం చేసిన కృషిని దీవిస్తాడు. తాను వాటిలోనికి ప్రవేశించి వాటిని తన సాన్నిధ్యంతో నింపుతాడు. ఈలా దేవుడు భౌతిక వస్తువుల్లోకి ప్రవేశించడమనేది మనుష్యావతార సమయంలోనే జరిగింది. ఆ సమయం నుండి దేవుడు సృష్టి వస్తువులన్నిటిలోను నెలకొని వున్నాడు. కనుక ఈ సృష్టి, ఈ భౌతిక ప్రపంచం చెడ్డది కాదు, మంచిది. ఇక్కడ ప్రతి వస్తువులోను అతని సాన్నిధ్యాన్ని దర్శించవచ్చు. అలాగే ఈ మంటిమీద మన కృషికూడ నిరర్థకమైపోదు. దేవుడు దాన్ని తన సాన్నిధ్యంతో నింపుతాడు. బహూకరిస్తాడు.

4.మన ఈ దేహం ఉత్తానం కోసం ఉద్దేశింపబడింది. నేడు ప్రభువుని భుజించే ఈ శరీరం ఓ దినం దేవుని ఎదుట నిలుస్తుంది. భక్తుడు ఇరెనేయసు ఈలా వ్రాసాడు. "ద్రాక్ష కొమ్మను నరికి నేలలో నాటితే అది మళ్ళా చిగురు వేసి పెరుగుతుంది. గోదుమ గింజను భూమిలో నాటితే అది మళ్ళా మొలకెత్తుతుంది. వీటిల్లో జీవశక్తి వుంది. కనుకనే యివి పెరుగుతున్నాయి. ఈలాగే మనం స్వీకరించిన దివ్య సత్ర్పసదం గూడ మనకు జీవశక్తిని ఇస్తుంది. ఈ జీవశక్తితోనే భూమిలో నాటబడిన మన దేహం కూడ మళ్ళా అంత్యదినాన లేస్తుంది." పదునెన్మిదవ శతాబ్ద బోధకుడు బోసువే "దివ్యసత్ర్పసాదాన్నిస్వీకరించడమంటె మోక్షాన్ని ఈ లోకంలో వుండగానే పొందడమే" అని నుడివాడు. కనుక ఈ దేహంపట్ల - అది పురుష దేహమైనా సరే, స్త్రీ దేహమైనా సరే - మనకు పూజ్యభావాలుండాలి. దాన్ని కామ దృష్టితో జూచి అపవిత్రం చేయకూడదు.