పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోధించింది. రెండురూపాల్లో దివ్యసత్ర్పసాదాన్ని ఈయాలన్నది దైవశాసనం కాదు. ఈ భోజనాన్ని ఏవిధంగా పంచిపెట్టవలసింది నిర్ణయించే అధికారం శ్రీసభ కుంది. దాన్ని రొట్టెరూపంలో స్వీకరించినా రక్తరూపంలో స్వీకరించినా పూర్తి క్రీస్తుని స్వీకరించవచ్చు కనుక దాన్ని ద్విరూపంలో స్వీకరించినా ఏక రూపంలో స్వీకరించినా ఫలితమేమో సమానమే.

ఇటీవల జరిగిన వాటికన్ మహాసభపై బ్రెంటు బోధలను పునరుద్దాటించింది. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మాత్రం విశ్వాసులకు ఈ భోజనాన్ని ద్విరూపాల్లో ఈయడం ఉచితమని చెప్పింది. ఆ సందర్భాలు గురుపట్టం, జ్ఞానవివాహం, జ్ఞానస్నానం, అవస్థాభ్యంగనం మొదలైన సంస్కారాలు, స్థానిక ఉత్సవాలూ, సభలూ సమావేశాలూ, జూబిలీ ఉత్సవాలు మొదలైనవి. నేడు చాల తావుల్లో ఈలాంటి సందర్భాల్లో దివ్యరక్తాన్ని గూడ ఇస్తున్నారు.

ట్రెంటు మహాసభ ఈ భోజనాన్ని ఏకరూపంలో భుజించినా ద్విరూపంలో భుజించినా ఫలితం సమానమేనని చెప్పిందన్నాం. ఈ ఫలితం విషయం ఏలా వున్నా దీన్ని ద్విరూపంలో భుజించినపుడు ఎక్కువ అర్థయుక్తంగా వుంటుంది. కారణాలివి : 1. ప్రభువు దీన్ని అన్నపానీయాలుగా స్థాపించాడు. నా శరీరం మీకాహారం, నా రక్తం మీకు పానం అన్నాడు. కనుక అన్నపానీయాలనే రెండు రూపాల్లో పుచ్చుకొన్నపుడే దీన్ని పూర్ణభోజనంగా స్వీకరించినట్లవుతుంది. 2. ఈ విందు సీనాయి నిబంధనాన్ని సూచిస్తుంది. ఆ నిబంధనంలో రక్తం వుంది. 3. ఈ విందు రానున్న మోక్షపు విందును సూచిస్తుంది. కాని ఆ మోక్షపు విందులో ద్రాక్షసారాయం కూడ వుంటుంది - మత్త 26,27-29, (యూదులు మోక్షాన్ని ద్రాక్షసారాయంతో కూడిన విందుగా భావించారు.) 4. రెండు రూపాల్లో పుచ్చుకొన్నప్పడు సమైక్యత రీత్యా ప్రోటస్టెంటు సమాజాలతో ఏకీభావం కుదురుతుంది.

నేడు మన క్యాతలిక్ సమాజంలో మామూలుగా దివ్యరక్తాన్ని విశ్వాసులకీయక పోవడానికి కారణం దాన్ని ఈయకూడదన్న భావం కాదు. మరి అలా ఈయడంలో వున్న చిక్కులు, వాటికన్ సభ బోధించినటూ, నేడు మనవాళ్ళు చాల తావుల్లో చేస్తున్నటూ, కొన్ని ముఖ్య సందర్భాల్లో దీన్ని విశ్వాసులకిస్తే సమస్య తీరిపోతుంది.

ప్రార్థనాభావాలు

1. మన పూజకు సూచనాలైన పూర్వవేదపు పాస్మబలీ నిబంధనబలీ రెండిటిలోను నైవేద్యాన్ని భుజించడమనేది వుంది. నూత్నవేదం పూజబలిని పేర్కొనేపుడెల్ల దివ్యసత్ర్పసాదాన్ని గూడ పేర్కొంటుంది. (యోహా 6, అ.చ. 2,42-46. 55