పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మన్నా కురుస్తుంది" అని చెప్పంది బరూకు దర్శన గ్రంధం - 29,8. ఇంకా ఇది పాస్కపండుగ సందర్భం కూడ - యోహా 6,4. కనుక ఈ భోజనం పాస్క భోజనాన్ని జ్ఞప్తికి తెస్తుంది.


ఇక దివ్యభోజనాన్ని గూర్చిన యోహాను బోధను తిలకిద్దాం. క్రీస్తు తానే జీవాహారాన్నని చెప్పాడు. ఈ యాహారం మన్నా కంటె మెరుగైంది. మన్నా తిన్న పితరులు చనిపోయారు. కాని ఈ జీవాహారాన్ని తిన్నవాడు చనిపోడు - 6,49-50. క్రీస్తు శరీరాన్ని భుజించి అతని రక్తాన్ని పానం జేసేవాడు నిత్యజీవం పొందుతాడు - 53. ఈ భోజనాన్ని తినేవాడు క్రీస్తులో నెలకొంటాడు. ప్రభువూ అతనిలో నెలకొంటాడు-56. ఇది ఉత్తానాన్ని గూడ ప్రసాదిస్తుంది-54. కాని అన్నిటికంటె ముఖ్యమైన వాక్యం 57వది. తండ్రి పంపగా వచ్చిన క్రీస్తు ఆ తండ్రినుండి జీవం పొందినట్లే, క్రీస్తుని భుజించిన భక్తుడు కూడ ఆ క్రీస్తునుండే జీవం పొందుతాడు. అదే జీవవాహిని తండ్రినుండి క్రీస్తనీ, ఉత్తాన క్రీస్తునుండి భక్తుడ్డీ చేరుతుంది. ఈ జీవవాహిని పరిశుద్ధాత్మే.

పై వాక్యాల్లో యోహాను దివ్యసత్రసాదాన్ని ఓ విందుగా భావించాడు. అది మనకు జీవమిచ్చే విందు. దాని ద్వారా మనం ఉత్తాన క్రీస్తు జీవం పొంది అతనితో ఐక్యమౌతాం.

2. జీవమయమైన ఆహారం

మూడవ శతాబ్దానికి చెందిన అలెగ్జాండ్రియా సిరిల్ అనే భక్తుడు దివ్యసత్రసాదాన్ని గూర్చి ఈలా వ్రాసాడు. "ద్రాక్షసారాయంలో మంచిన రొట్టెను ఆ పానీయం రుచిమంతం చేస్తుంది. తేనెలో మంచిన వస్తువును ఆ తేనె మధురం చేస్తుంది. అగ్నిలో పెట్టిన ఇనుమును ఆ యగ్ని గనగన మండిస్తుంది. అలాగే దైవవార్త మన మానుష శరీరాన్ని చేకొన్నపుడు ఆ శరీరాన్ని జీవమయం చేసింది. దివ్యసత్రసాదంలో మనం భుజించేది ఈ శరీరాన్నే నేను తండ్రి నుండి జీవం పొందినట్లే నన్ను భుజించేవాడు కూడ నానుండి జీవం పొందుతాడు అన్నాడు ప్రభువు. ఏలాగ? మైనపు ముక్కను మరో మైనపు ముక్కకు అంటిస్తే అవి రెండూ ఒకటిగా అంటుకొనిపోతాయి. అలాగే క్రీస్తు శరీరాన్ని భుజించి అతని రక్తాన్ని పానం జేసేవాడు అతనితో అతుకుకొనిపోతాడు. ఇక అభక్తుడు ప్రభువులోను, ప్రభువు అతనిలోను వసిస్తారు". ఈ వాక్యం ప్రకారం దైవవార్త మొదట క్రీస్తు శరీరాన్ని జీవమయం చేస్తుంది. దివ్యసత్రసాదంలో మనం ఈ జీవమయ శరీరాన్ని భుజించినపుడు అది మనలను గూడ జీవమయులను చేస్తుంది.