పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అంటారు ప్రోటస్టెంటులు. నిజమే. కాని ఈ యాధ్యాత్మిక సాన్నిధ్యం కంటికి కన్పించదు. దేహధారులమైన మనం కంటితో చూస్తేనే గాని తృప్తి చెందం. కనుక మనకు సంజ్ఞలూ సంకేతాలూ అవసరం. అందుకే క్రీస్తు దివ్యసత్రసాదమనే సంజ్ఞారూపంలో మన మధ్యలో వసిస్తూంటాడు. ఈ సాన్నిధ్యాన్ని మనం కంటితో జూచి తృప్తి చెందుతాం. పూర్వం యావే ప్రభువు మందసంలో వుండి యిస్రాయేలీయులను ఎడారిగుండా వాద్దత్తభూమికి నడిపించాడు. నేడు క్రీస్తు సత్రసాదంలో వుండి మనలను ఈ లోకం గుండా మోక్షానికి నడిపిస్తాడు. యాత్రికులమైన మనకు గమ్యాన్ని చేరుకొనేదాకా ఈ సాన్నిధ్యం అవసరం.సత్రసాద సన్నిధిలోకి వెళ్ళినపుడు మనకు ఊరట ఆదరవూ కలుగుతుంది.అది మనకు అండదండగా వుంటుంది. మనకు ఇన్ని వుపకారాలు చేసిన ఆ ప్రభువుకి సత్రసాద సన్నిధిలోవందనాలు అర్పించుకోవచ్చు.

   శ్రీసభలో తొలి వెయ్యేండ్లకాలంలో దివ్యసత్రసాద ఆరాధనం లేనిమాట నిజమే, క్రీస్తు వాక్యాల్లో కూడ ఈ యారాధనా భావం ప్రత్యక్షంగా లేనిమాట యధార్థామే. కాని క్రీస్తు ఆత్మ క్రైస్తవ సమాజంలో క్రొత్త భావాలను వ్యాప్తిలోనికి తీసికొని రాగలదు. అసలు క్రీస్తు తన శరీరాన్ని మనం భుజించాలి అని చెప్పినపుడు దాన్ని మనం గౌరవంతో చూడాలి అనే ఉద్దేశించాడు కదా? ఆ గౌరవమే ఆరాధనం. ఇక్కడ పరోక్షంగా వున్న భావాన్ని ఆత్మ తర్వాత శ్రీసభలో ప్రత్యక్షం చేసింది. నేటి మన మతాంశాలన్నిటికీ బైబులు ఒక్కటే ఆధారం కాదు. పారంపర్య బోధనం కూడాను. క్యాతలిక్ శ్రీసభలో 11వ శతాబ్దం నుండి, అనగా వెయ్యేండ్ల నుండి, ఈ యారాధనా సంప్రదాయం ప్రచారంలో వుంది. వెయ్యేండ్ల ఈ సంప్రదాయం - అవి తొలి వెయ్యేండు కాకపోయినా సరే - మాన్యమైందే. కనుక సమైక్యరీత్యా ఇతర క్రైస్తవ శాఖలకు కష్టమనిపించినా క్యాతలిక్ శాఖమాత్రం ఈ యారాధనాన్ని కొనసాగించుకొని పోతూనే వుంటుంది. సమైక్యతలో ఒక్క సోదరప్రేమను మాత్రమేకాక సత్యాన్ని గూడ పాటించాలి - ఎఫె4,15.

2. సత్ర్పసాద సందర్శనాలు

పూర్వాంశలో సత్రసాదాన్ని ఎందుకు ఆరాధించాలో పరిశీలించాం. ఈ యారాధనలో సత్రసాద సందర్శనాలు కూడ ఒక భాగం.కనుక ఆ ప్రభువుని ఏలా సందర్శించాలో,ఆ సమయంలో ఏలాంటి భక్తిభావాలు ప్రదర్శించాలో తెలిసికొందాం. బొద్దువాలులంకెపొదిగిన ఫైలుసాక్ష్యాలుఉన్నతప్రత్యేక అక్షరాలుసహాయంఅచ్చుదిద్దు ఉపకరణాలు

1. దేవుడే మనలను సందర్శించాడు

పూర్వవేదమంతటా గూడ ప్రభువు తన ప్రజలను సందర్శించాడు అనే భావం ప్రచురంగా కన్పిస్తుంది. అతడు ఐగుప్త బానిసంలో వ్రుగ్గిపోయే తన భక్తులను సందర్శించాడు