పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


-నిర్గ 3,9. అబ్రాహాములాంటి పుణ్యపురుషులను సందర్శించి వాళ్ళను తన నాయకులను జేసికొన్నాడు

- ఆది 17,1.ఇంకా ఆ ప్రభువు గుడారం,మందసం, దేవళం మొదలైన వాటిద్వారా తన ప్రజలను సందర్శించాడు. రెండవ ప్రవాసమైన బాబిలోనులో కూడ భక్తులు అతని సందర్శనం కోసం వేచివుండేవాళ్ళ - కీర్త 106,4. ఇక నూత్నవేదంలో ప్రభువు తన ప్రజలను శాశ్వతంగా సందర్శించాడు. క్రీసు మనమధ్య నివాసమేర్పరచుకొన్నాడు - యోహా 1.14.అతడు ఉత్తానమై తండ్రి చెంతకు వెళ్ళిపోయిన తరువాత సంస్కారాల ద్వారా,విశేషంగా దివ్యసత్ర్పసాదం ద్వారా,మనలను సందర్శిస్తాడు. ఈలా నిత్యం మన మధ్యలో వుండి మనలను సందర్శించే ప్రభువుని మనం మాత్రం సందర్శించవద్దా? అతడు మన దగ్గరికి వస్తూంటే మనం మాత్రం అతని దగ్గరికి వెళ్ళవద్దా? ఈలా వెళ్ళడమే దివ్యసత్ర్పసాద సందర్శన మవుతుంది.

2.పాస్మబలీ నిబంధనబలీ

పాసుబలీ నిబంధనబలీ దివ్యసత్రసాదానికి పూర్వ రూపాలని చెప్పాం. పాలస్తీనా దేశంలో యూదులు ఏటేటా పాస్మబలి జరుపుకొనేవాళ్ళ వాళ్ళ ఆ బలిలో గొర్రెపిల్లలను భుజించడం ద్వారా పూర్వపు ఐగుపు దాస్య విమోచనాన్ని స్మరించుకొన్నారు. os స్మరణం ద్వారా దాస్య విమోచకుడైన ప్రభువు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. మన దివ్యసత్రసాదంలో గూడ స్మరణం అనేది వుంది. ఈ దివ్యసత్రసాద సన్నిధిలో జపం జేసికొంటూ క్రీస్తు మరజోత్తానాలనూ, అతడు మనకు పాపదాస్యం నుండి విమోచనం కలిగించడాన్నీ తండ్రికి జ్ఞాపకం చేస్తాం. ఆ జ్ఞాపకం ద్వారా తండ్రి మనలను కరుణిస్తాడు. దాస్య విమోచకుడైన క్రీస్తు మనలను దీవిస్తాడు. సీనాయికొండ చెంత జరిగిన నిబంధన బలిలో యావే యిప్రాయేలీయులకు మరింత సన్నిహితుడయ్యాడు. అతడు వాళ్ళ దేవుడయ్యాడు, వాళ్లు అతన్ని కొలిచే భక్తులయ్యారు. మన దివ్యసత్ర్పసాదం గూడ క్రీస్తు మనతో జేసికొన్న నిబంధనను తెస్తుంది. ఈ సత్రసాదం ఎదుట మనం ప్రార్ధనం జేసికొనేపుడు ఈ ప్రభువు గూడ మనకు మరింత సన్నిహితుడౌతాడు. కనుక మనం వీలైనప్పడెల్ల ఈ సాన్నిధ్యంలోకి వెళ్ళాలి. అక్కడ అతన్ని ఆరాధించాలి. అతని ప్రజలమూ అతని భక్తులమూ కావాలి.

8. సత్రసాద స్వీకరణానికి సిద్ధం కావడం

దివ్యసత్ర్పసాద సందర్శనం ఎప్పడు కూడ సత్ర్పసాదం భోజనమనే అంశాన్ని జ్ఞప్తికి తెచ్చేలా వుండాలి. గుళ్ళ మనం ఆరాధించే సత్రసాదం ఎప్పుడు కూడ జరిగిపోయిన