పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యిరుతెగల క్రైస్తవులూ సత్రసాద ఆరాధనాన్ని నిరాకరిస్తారని చెప్పాం. వీళ్ళ వాదం యిది. సత్రసాద స్థాపన సందర్భంలో క్రీస్తు తన శరీరాన్ని భుజించమన్నాడే గాని ఆరాధించమనలేదు. మరి నేడు క్యాతలిక్ శ్రీసభ దాన్ని ఆరాధిస్తూందంటే సువిశేష బోధకు వ్యతిరేకంగా పోయినట్లే. దివ్యశరీరాన్ని బలిగా అర్పించాలి, భోజనంగా స్వీకరించాలి. అంతేగాని ఆరాధించనక్కరలేదు. ఈలాంటి భిన్నాభిప్రాయాలు వున్నపుడు వాళ్ళకూ మనకూ సమైక్యత ఏలా కుదురుతుంది?

3) మనవాదం

   ఆర్తోడోక్స్, ప్రోటస్టెంటులు, క్యాతలిక్కులు అనే మూడు తెగల క్రైస్తవుల్లో క్యాతలిక్కులు మాత్రమే దివ్య సత్రసాదాన్ని ఆరాధిస్తున్నారు. తతిమ్మారెండు తెగల వాళ్లు అలా చేయడం లేదు. మనమొక్కరమే ఈలా ఆరాధించడంలో ఔచిత్యమేమిటి? ఈ యారాధనం అనౌచిత్యమైందేమీ కాదు. సబబైందే. కారణాలివి :
 1. సిలువబలి నర్పించిన క్రీస్తు బలిమూర్తి, బలిమూర్తిగా అతని సాన్నిధ్యం నేడు కూడ మోక్షంలో కొనసాగుతుందని చెపూంది హెబ్రేయుల జాబు 7,25.ఈ సాన్నిధ్యం కల్వరి బలికి చెందింది. ఇక నేడు మోక్షంలోని ఉత్తాన క్రీస్తులో ఆ బలిమూర్తి సాన్నిధ్యం అలా కొనసాగుతుందంటే, భూలోకంలో దివ్యసత్రసాదంలో మాత్రం ఆ బలిమూర్తి సాన్నిధ్యం ఎందుకు కొనసాగకూడదు? ఈ దివ్య సత్ర్పసాదం గూడ కల్వరిబలికి సంబంధించినదేగదా? కనుక దీనిలో గూడ దైవసాన్నిధ్యం వుండవచ్చు, వుంటుంది.
 2. ప్రోటస్టెంటు క్రైస్తవులు బైబులు గ్రంథాన్ని ఎంతగానో అభిమానిస్తారు. నేటికి దానిలో దైవసాన్నిధ్యముందని యెంచుతారు. ఈ దైవవాక్కులో కొనసాగుతూన్న సాన్నిధ్యం దైవశరీరంలో మాత్రం కొనసాగదా? మనుష్యవాక్కులోనికి ప్రవేశించిన దేవుడు మనుష్య శరీరంలోకి ప్రవేశించడా? ప్రాచీన పితృపాదులు దివ్యసత్ర్పసాదాన్ని రెండవ మనుష్యావతారంగా ఎంచారు. ఆ దైవవార్త మన మనుష్యరూపం చేకొంది. మన మానవవాక్కునే చేకొంది. మన మానవ శరీరాన్ని చేకొంది. కనుక క్రీసు మనుష్యావతారంలోను, దివ్యగ్రంథంలోను, దివ్యసత్రసాదంలోను ఒకేరీతిగా దైవసాన్నిధ్య ముండాలి కదా?
 3. క్రీస్తు శరీరం ప్రధానంగా భుజించదగిందే, ఒప్పకొన్నాం. భుజించడానికే దాన్ని పదిలపరుస్తాం. కాని ఓమారు దాన్ని పదిలపరచాం గనుక ఆరాధించాలి. దాన్ని ఆరాధించడం కోసం పదిలపరచడం లేదు, పదిలపరుస్తున్నాం గనుక ఆరాధించాలి.
4. యోహాను 14,23 ప్రకారం ఉత్థాన క్రీస్తు మన హృదయాల్లో వసిస్తూంటాడు. ఇది ఆధ్యాత్మికమైన సాన్నిధ్యం. ఇది చాలు కదా మళ్ళా దివ్యసత్రసాద సాన్నిధ్యమెందుకు