పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


     క్రమేణ ఈ సాన్నిధ్యం పట్ల భక్తి యింకా పెరిగింది. 13వ శతాబ్దంలో దివ్యసత్రసాదపు పండుగను నెలకొల్పారు. సత్రసాద ఆశీర్వాదమూ ప్రదక్షిణలు నలభై గంటల ఆరాధనలూ మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ఆరాధనం ప్రచారంలోకి వచ్చింది. కాని సత్రసాదాన్ని ఆరాధించడం ఎంతగా ప్రచారంలోకి వచ్చిందో దాన్ని భోజనంగా స్వీకరించడం అంతగా తక్కువైపోయింది. విశ్వాసులు తాము పాపలమనీ ఆ దివ్యభోజనాన్ని భుజించడానికి యోగ్యులంకామనీ యెంచేవాళ్ళు పూజకు వెళ్లేవాళ్ళు కాని సత్రసాదాన్ని తీసికొనేవాళ్ళు కాదు.
   ఈ వుద్యమంలో కొంత మంచీ కొంత చెద్దాగూడ లేకపోలేదు.మంచి యేమిటంటే,తొలి వెయ్యేండ్లల్లో లేని ఆరాధనాంశం 11వ శతాబ్దం తర్వాత ప్రచారంలోకి రావడం.ఇది మెచ్చుకోదగిన అంశం.చెడ్డ యేమిటంటే దివ్యసత్రసాదం భోజనం అన్న విషయం మరచిపోవడం.ఎప్పడు గూడ ప్రభువు దివ్యసత్రసాదంలో తన్ను తాను మనకు భోజనంగా అర్పించుకోగోరుతుంటాడు.ఇది అతని చైతన్యవంతమైన సాన్నిధ్యం.ఈ చైతన్యవంతమైన సాన్నిధ్యాన్ని విశ్వాసులు కేవలం జడాత్మకమైన సాన్నిధ్యంగా మార్చారు.అనగా ప్రభువు సత్రసాదంలో వట్టినే వుండిపోతాడు అనుకొన్నారు.మనం అతన్ని భుజించనక్కరలేదు,ఆరాధిస్తే చాలు అనుకొన్నారు.ఇది నిక్కంగా పొరపాటు.

2) సమైక్యతా సమస్య

      ఆదిమ క్రైస్తవ సమాజం నుండి చీలిపోయిన వాళ్ళంతా నేడు దివ్యసత్రసాద సాన్నిధ్యాన్ని నిరాకరిస్తారు. ఈలా చీలిపోయినవాళ్ళు రెండు తెగలు. మొదటి తెగవాళ్ళు 8వ శతాబ్దంలోనే ඩීච්ෆියරාජ්‍ය. వీళ్ళకూ మనకూ ఒక్క పాపగారి ఆధిపత్యం విషయంలో తప్పితే వ్యత్యాసాలు అంతగా లేవు. వీళ్ళకు ప్రాచ్య శ్రీసభ క్రైస్తవులు లేక ఓర్తోడోక్స్ క్రైస్తవులు అని పేరు. వీళ్ళు తమ ఆరాధనంలో గ్రీకు భాషను వాడతారు. వీళ్ళు దివ్యసత్రసాదంలో పూజ ముగిసాక గూడ దైవసాన్నిధ్యముంటుందని నమ్ముతారు. దాన్ని పదిలపరుస్తారు. ఐనా అలా పదిలపరచిన దివ్యసత్ర్పసాదాన్ని భోజనంగా వాడుకొంటారే గాని ఆరాధించరు. మన ల్యాటిన్ శ్రీసభలో లాగ గ్రీకు శ్రీసభలో ఆరాధన పద్ధతి ప్రచారంలోకి రాలేదు.
      ఇక రెండో తెగవాళ్ళు 16వ శతాబ్దంలో లూతరు కాల్విను మలంకోను మొదలైనవాళ్ళ నాయకత్వం క్రింద చీలిపోయినవాళ్ళ వీళ్ళనే మనం ప్రోటస్టెంటులు అంటాం. ఈ శాఖల వాళ్ళ భావాల ప్రకారం పూజ ముగిసాక సత్రసాదంలో అసలు దైవసాన్నిధ్యమే వుండదు, అది మళ్ళా మామూలు రొట్టె ఐపోతుంది. కనుక దాన్ని పదిలపరచడం గాని ఆరాధించడం గాని ఎంతమాత్రం పనికిరాదు.