పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిరోజుల్లో క్రైస్తవులు దివ్యసత్రసాదాన్ని బలిగాను భోజనంగాను మాత్రమే యెంచేవాళ్ళు వాళ్ళు దాన్ని ఆరాధించాలి అనుకోలేదు. 11వ శతాబ్దం తర్వాత ఆరాధనం గూడ ప్రచారంలోకి వచ్చింది. నేడు ప్రోటస్టెంటు శాఖలకు చెందిన క్రైస్తవులు ఈ యారాధనాన్ని అంగీకరించరు. కనుక మనం దివ్యసత్రసాదాన్ని ఎందుకు ఆరాధిస్తున్నామో క్షుణ్ణంగా అర్థం చేసికొని వుండాలి. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1. దివ్యసత్ర్పసాద ఆరాధనం

1) చారిత్రకాంశాలు

 తొలిరోజుల్లో క్రైస్తవులు జ్ఞానస్నానాన్ని ప్రధాన సంస్కారంగా ఎంచారు. జ్ఞానస్నానంతో ప్రారంభమైన క్రైస్తవ జీవితాన్ని సత్రసాదం పెంపుకి తెస్తుంది అని మాత్రం భావించారు. కనుక వాళ్ళ దృష్టిలో సత్రసాదం జ్ఞానస్నానమంత ముఖ్యమైంది కాదు. ఇక, క్రీస్తు దివ్యసత్ర్పసాదాన్ని స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే అతడు దాన్ని భుజించమన్నాడు కాని ఆరాధించమనలేదు. కనుక తొలినాటి క్రిస్థవులు దాన్ని భోజనంగా ఎంచారు గాని ఆరాధ్య వస్తువుగా ఎంచలేదు. తొలిరోజుల్లో ఓ సంప్రదాయముండేది. పూజకు హాజరైన క్రైస్తవులు సత్ర్పసాదాన్ని ప్రసాదంగా యిండ్లకు తీసికొని వెళ్ళేవాళ్ళు దాన్ని తమ యిండ్లలో పదిలపరచుకొని భుజించేవాళ్ళు ఈ సంప్రదాయం 8వ శతాబ్దం వరకూ కొనసాగుతూ వచ్చింది. అదేకాలంలో దాన్ని గుళ్ళల్లో గూడ పదిలపరచి పూజ జరగని సమయాల్లో పంచిపెట్టేవాళ్ళ వ్యాధిగ్రస్తులకు కూడ భోజనంగా ఇచ్చేవాళ్ళు. ఈ సందర్భాలన్నిటిల్లోను దాన్ని భోజనంగానే యెంచారు. విశ్వాసులు దాన్ని బహిరంగంగా ఆరాధించలేదు.
  11వ శతాబ్దంలో బెరింగారియస్ అనే అతని మూలంగా ఓ పెద్ద మార్పు వచ్చింది. అతడు దివ్యసత్రసాదంలో దైవసాన్నిధ్యం లేదనీ అసలు రొట్టెరసాలు క్రీస్తు శరీరరక్తాలుగా మారనే మారవని వాదించాడు. అందుచేత శ్రీసభ దివ్యసత్రసాదంలో దైవసాన్నిధ్యముందని ప్రచురంగా బోధించడం మొదలుపెట్టింది. ప్రజలకు గూడ ఈ సాన్నిధ్యం పట్ల భక్తిభావం పెరిగింది. క్రమేణ ప్రజల్లో అది భోజనమన్న విషయం మరుగున పడిపోయింది. ఆరాధ్యవస్తువన్న విషయం పెచ్చు పెరిగింది. కనుక విశ్వాసులు దాన్ని పుచ్చుకోవడం మానివేసి ఆరాధించడం మొదలుపెట్టారు. సాన్నిధ్యం నడిపూజలో నెలకొంటుంది. కనుక ఆ విషయాన్ని విశ్వాసులకు విదితం చేయడం కోసం గురువులు నడిపూజలో సత్రసాదాన్ని పైకెత్తి చూపించేవాళ్ళు అలా పైకెత్తబడిన దివ్యభోజనాన్ని కంటితో చూడ్డం మహాభాగ్యమనుకొన్నారు విశ్వాసులు.