పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/327

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది26. ఇక్కడ మకరమంటే సముద్రంలో జీవించే ఏదో పెద్ద జంతువు. దేవుడు అలసిపోయినప్పడు ఈ జంతువు దగ్గరికి వచ్చి దానితో కాసేపు ఆడుకొంటాడట! ఈ కవి హృదయం పసిబిడ్డ హృదయంలాంటిది అనడానికి ఈ చరణమే తార్కాణం.

27. సాగరాన్నివర్ణించాక, ప్రభువు ప్రాణికోటిని పోషించేతీరును వివరిస్తున్నాడు. ఈ కీర్తనలోకెల్ల ఈ 27-30 చరణాలు ఎక్కువ విలువైనవి.

దేవుడు ప్రాణులను పట్టించడం మాత్రమేకాదు, తిండిపెట్టి వాటి ప్రాణాలు నిల్పుతూంటాడు కూడ.

28. దేవుడు ఓ తల్లిలా, తండ్రిలా, యజమానుళ్ళా తాను చేసిన ప్రాణులకు తిండి పెడతాడు. అతని దయ అంత గొప్పది.

29-30. ఇక్కడ మొగం ప్రక్కకు త్రిప్పకోవడమంటే తిండి పెట్టకపోవడం. దేవుడు ఆహారం పెట్టకపోతే మృగాలు వ్యాకులపడతాయి.

దేవుడు ఊపిరితీస్తే ప్రాణులు చస్తాయి. ఊపిరిపోస్తే క్రొత్తజీవులు పడతాయి. అతడు కొన్ని ప్రాణులు చస్తుంటే మరికొన్నిటిని పుట్టిస్తుంటాడు. ఎప్పటికప్పడు క్రొత్తప్రాణులను సృజించి చావును జయిస్తుంటాడు. ఈలా జనన మరణాల్లో కూడ అతని హస్తాన్ని చూడవచ్చు.

ప్రభువు భూమికి నూత్నజీవనాన్ని ఒసగుతాడు. రచయిత దృష్టిలో ఈ "నూత్నజీవం" భౌతికమైందే. కాని ఈ పాదంలో వరప్రసాద జీవంకూడ ధ్వనిస్తుంది. కనుకనే తిరుసభ ఈ వాక్యాన్ని పెంతెకోస్తు ఉత్సవంనాడు వచ్చే పవిత్రాత్మ ప్రార్థనకు కూడ వాడింది.

31. ప్రాణి పోషణాన్ని గూర్చి చెప్పాక, ఈ చివరి భాగంలో సృష్టికర్తను స్తుతిస్తున్నాడు.

సృష్టి దేవుని మహిమనూ కీర్తినీ వెల్లడిచేస్తుంది. కనుక దేవుడు తన సృష్టిని చూచి ఆనందిస్తాడు.

32. ప్రభువు నేలవైపు చూస్తే భూకంపం కలుగుతుంది. కొండలను తాకితే అగ్నిజ్వాలలు వెలువడతాయి. అతడు అంత శక్తికలవాడు. పూర్వం ప్రభువు సీనాయి కొండమిూద మోషేకు ధర్మశాస్త్రం ప్రసాదించినపుడు భూకంపమూ పొగలూ మంటలూ ఉరుములూ ఉప్పతిల్లాయి. ఇక్కడ ఆ సంఘటనను జ్ఞప్తికి తెస్తున్నాడు.

33. రచయిత దేవునికి తనవంతు స్తుతిని తాను చెల్లిస్తానని చెప్తున్నాడు.

34. ఈ చరణంలో "నా యాలోచలు" అంటే కీర్తనకారుడు చెప్పిన ఈ కీర్తనే. తాను కట్టిన ఈ పాట భక్తులు దేవళంలో అర్పించే ధాన్యబలిలాగ దేవునికి ప్రీతి కలిగించాలని అతని కోరిక.