పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35. దుషులు దేవుణ్ణి స్తుతించరు. కనుక వాళ్ళు నాశం కావాలని కోరుకొంటున్నాడు.

కడన కీర్తన ప్రారంభాన్ని మళ్ళా యెత్తుకొని ఆత్మమా దేవుణ్ణి సన్నుతింపమని చెప్తున్నాడు. అనగా దైవసన్నుతికి తన్నుతాను ఆహ్వానించుకొంటున్నాడు. మనం కూడ ప్రకృతిలో దర్శనమిచ్చే దేవుణ్ణి స్తుతించి కీర్తించాలి.

4. ప్రార్ధనా భావాలు

1. భక్తులు ప్రకృతి సౌందర్యంలో దేవుణ్ణి గుర్తించడం నేర్చుకోవాలి. ప్రకృతి పరమేశ్వరాకృతి. సౌందర్యంభగవంతుని చేవ్రాలు. అద్దంలో మన ముఖంలాగే ప్రకృతిలో దేవుని ముఖం కన్పిస్తుంది. సృష్టివస్తువులన్నీ ఆ ప్రభువు కళ్యాణ గుణాలను తెలియజేస్తాయి - రోమా 1,20. మనం బస్సుల్లో రైళ్ళల్లో ప్రయాణం చేసేపుడు ఈ కీర్తనను ధ్యానించుకోవచ్చు. మన ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో అందమైన ప్రకృతే కన్పిస్తుంది. కనుక మన ప్రయాణాల్లో ఆయా సుందరదృశ్యాలను చూచినపుడెల్లా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. ఇంకా, మనం అలసిపోయివుండి చక్కగా ప్రార్ధనం చేసికోలేనపుడుగూడ ఈ కీర్తన సహాయంతో సులువుగా జపించవచ్చు.

2. క్రీస్తుకి ప్రకృతి అంటే ఎంతో యిష్టం. అతడు ఏకాంతంగా సరస్త్రీరానా కొండల్లోను కాలం గడిపేవాడు. తన బోధల్లో ఆకాశ పక్షులనూ, చక్కని పూలుపూసే లిల్లీ మొక్కలనూ పేర్కొన్నాడు — మత్త 6,26–29. చాలమంది పునీతులు కూడ - ప్రకృతిపట్ల ఎంతో యిష్టం చూపారు. అసిస్సీఫ్రాన్సిస్ దీనికి మంచి ఉదాహరణ. అతడు సూర్యగీతంలో సూర్యుణ్ణి సోదరుడనీ చంద్రుడ్డి సోదరి అనీ సంబోధించాడు. మనంకూడ ప్రకృతిపట్ల ప్రీతిని పెంపొందించుకోవాలి. అది మనకు దేవుణ్ణి చూపిస్తుంది, మనలను దేవుని చెంతకు చేరుస్తుంది.

3. మనం మాతృగర్భంలో పిండంగా ఉన్నపుడే ఓదినం ప్రభువు కరుణతో మనకు ఊపిరి పోసాడు. ఆనాటినుండి మనం బ్రతుకుతూవచ్చాం. అరవై డెబ్బె యేండ్లు జీవించాక మళ్లా ఓనాడు అతడు మన ఊపిరి తీస్తాడు. అప్పుడు మనం చనిపోతాం. జీవానికీ మరణానికీ అతడే అధిపతి. మన బ్రతుకూ చావూకూడ అతనిచేతుల్లోనే వున్నాయి (29–30).

4. కీర్తనకారుడు 30వ చరణంలో "నీవు భూమికి నూత్నజీవము నొసగెదవ" అన్నాడు. ఇప్పడీ వాక్యం పవిత్రాత్మ ప్రార్థనలో వస్తుంది. పెంతెకోస్తు పండుగనాడు పవిత్రాత్మ